అభినవబాలనీతికథాసప్తతిః
28.
ఏకాక్షివికలస్య ఏణస్య కథా
కశ్చిత్ ఏకాక్షివికలః హరిణః నిత్యమ్
అబ్ధితటే చరన్నాసీత్। స చ ఇత్థమ్ అచిన్తయత్– “చరతో మమ కాణమ్ అక్షి
జలాభిముఖమ్ అవికలం చాక్షిస్థలమభితః దత్తం చేత్, ఘాతయితా
సంనిహితః సన్ జ్ఞాయేత।” ఇతి। ఏవమ్ అరిష్టస్య నివారణోపాయం
సంవిధాయ ఆత్మానమ్ అకుతోభయం గణయతి స్మ। కశ్చిత్ మృగవధాజీవః చిరాయ తస్మిన్ మృగే బద్ధలక్ష్యోఽపి
తం న ప్రాప్తవాన్। తతః స నావమారుహ్య సుగుప్తం జలతః అభ్యేత్య తం హరిణం
గులికాప్రక్షేపేణ హతవాన్। ప్రాణోత్క్రమణవేలాయాం స ఏణః ఏవం వ్యలపత్। “భో విధే, అనధిగమ్యం తే విలసితం. ఇతో భయమితి యత్రాహమ్
అబోధం తస్మాన్నాహం విద్ధః। అపి తు యత్ర నో భయమితి అబుధ్యే తయైవ దిశా మే నిధనం
జాతమ్।” ఇతి॥
నీతిః– నిర్భయాః
వయమితి న మన్తవ్యమ్। సభయా ఇతి మత్వా నిర్భయత్వసమ్పాదనే నాత్యర్థం యతితవ్యమ్।
నిర్భయత్వం నాస్మాస్వధీనమ్॥
ప్రశ్నాః-
౧. కీదృశః
హరిణః కుత్ర చరన్నాసీత్?
౨. హరిణః
కిమచిన్తయత్?
౩. మృగవధాజీవః
తం కథం హతవాన్?
౪. ఏణః
ప్రాణోత్క్రమణవేలాయాం కిమచిన్తయత్?
౫. అస్యాః
కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతి
కథా సప్తతి
28. ఒక
కన్నులేని జింక కథ
ఒక కన్నులేని జింక (ఒకే కన్నుతో చూసే జింక)
నిత్యము ఒక నదీ తీరంలో తిరుగుతూ ఉండేది. అది ఈ విధంగా అనుకుంది. ‘తిరుగుతూ ఉన్న నేను గుడ్డిగా ఉన్న
కంటిని నీటి వైపు ఉంచి మంచిగా ఉన్న కంటిని భూమి వైపు ఉంచతే కనుక ఎవరన్నా బోయవాడు నాకు దగ్గర ఉండి ఉంటే నాకు
కనిపిస్తాడు’ అని అనుకుంది. ఈవిధంగా అరిష్టాన్ని నివారించే ఉపాయాన్ని తెలుసుకుని
దాన్ని అదే భయం లేనిదిగా పరిగణించుకున్నది. ఒకసారి ఒక వేటగాడు ఆ మృగం మీద కన్ను
ఉంచిన వాడై దాన్ని పొందలేకపోయాడు. వాడు ఒకసారి పడవ ఎక్కి, మెల్లగా కనిపించకుండా
దాగుతూ వచ్చి, నీటి వైపు నుంచి వచ్చి జింకను రాళ్ళతో కొట్టి చంపేశాడు. ప్రాణం
పోతున్న వేళ ఆ జింక ఈ విధంగా ఏడిచింది- ‘ఓ! విధి నిన్ను నేను నీ విధి విలాసాన్ని
తెలుసుకోలేకపోయాను. నాకు భయం ఉన్నచోటు నుండి నేను కొట్టబడలేదు. ఎక్కడైతే భయంలేదు
అనుకున్నానో ఆ దిశ నుంచే నా మరణం సంభవించింది.’ అని.
నీతి- నిర్భయులమై మనము ఉన్నాము అని మనం
ఎప్పుడు అనుకోరాదు. భయంతో ఉన్నామని అనుకుని నిర్భయం పొందుడనికే ప్రయత్నిస్తూ
ఉండాలి. నిర్భయం అనేది మన ఆధీనంలో ఉండదు.
No comments:
Post a Comment