అభినవబాలనీతికథాసప్తతి
నమస్సులు.
సంస్కృతం
నేర్చుకునేవారు, ప్రారంభికులు
ఎవరైనా ఉంటే - ఈ కథలు ఉన్నాయి కదా- వీటిని ఉపయోగించి చక్కగా నేర్చేసుకోవచ్చు.
ఎట్లా అంటారా? మొదలు సంస్కృతంలో కథ చదవండి. తరువాత తెలుగులో చదవండి. ముందు మీకు కథ
అర్థమైపోతుంది. తరువాత సంస్కృతం వాక్యం ఒకటి చదవండి. దానికి తెలుగు అనువాద వాక్యం
చదవండి. పదాలు తెలిసినవి పోల్చుకోండి. తెలియనివి గమనించి, ‘ఈ పదానికి ఇది అర్థము’
అని మనసులో గుర్తు పెట్టుకోండి. తరువాత రెండవ సంస్కృత వాక్యం చదవండి. దానికి
తెలుగు అర్థంలో వాక్యం చూడండి.
సాధ్యమైనంతవరకు
సంస్కృతవాక్యనిర్మాణానికి దూరం పోకుండా చేయబడిన అనువాదాలు కనుక, తెలుగు వాక్య
నిర్మాణం సంస్కృత వాక్యానికి దగ్గరగా ఉన్నందున, మనం సులువుగా పదాల కూర్పును బట్టి
వాక్య నిర్మాణాన్ని తెలుసుకోవచ్చు.
అంతేకాక
వీలైతే ఒక పుస్తకం పెట్టుకొని, ఒక వాక్యంలో ఏ పదాలు తెలియలేదో వాటికి తెలుగు అర్థం
గుర్తించి వ్రాసి ఉంచుకోండి. కొంత తెలుగువాడకంలో సంస్కృత పదాలు (ఇప్పటికీ మిగిలి)
ఉన్నందున ఆ ప్రయత్నం త్వరగా ఫలించవచ్చు. పదాల అర్థాలు తెలిసినా కొద్ది ప్రయోగం
కోసం మనలోపల పదజ్ఞానం పెరుగుతుంది.
ఇక-
తెలుగు అనువాదం ఆధారంగా కథ అర్థమైంది కనుక కింది ప్రశ్నలకు సమాధానాలు కథలో చూసి,
సంస్కృతంలోనే చెప్పటానికి ప్రయత్నించండి. శుభాకాంక్షలు.
No comments:
Post a Comment