Sunday, 4 September 2016

6. వానరస్య తస్య ప్రతిబిమ్బస్య చ కథా - 6. కోతి, దాని నీడ కథ

6. వానరస్య తస్య ప్రతిబిమ్బస్య చ కథా
          ఏకః వానరః కస్యచిత్ కూపస్య ప్రాన్తే స్థిత్వా ఆమ్రస్య ఫలం అభక్షయత్। తదా సః అవనమ్య కూపస్య అన్తః అవలోకయతి స్మ। తదానీం తస్య ప్రతిబిమ్బం జలే అపశ్యత్। తేన అన్యః మర్కటః జలస్య అన్తః ఆమ్రం భక్షయన్నివ దృశ్యతే స్మ। తద్ దృష్ట్వా అయం వానరః అన్యస్య తస్య మర్కటస్య భయం ఉత్పాద్య తస్య ఫలం గ్రహీతుమ్ ఐచ్ఛత్। అథ సః ఉచ్చైః అశబ్దయత్। తేన తస్య ముఖే స్థితం ఫలం కూపే పతిత్వా న్యమజ్జత్। తతః సః వానరః దుఃఖితః అభవత్॥
          నీతిః పరకీయం గృధ్నుః స్వీయమపి నాశయతి॥
ప్రశ్నాః-
౧. వానరః కూపస్య ప్రాన్తే కిమకరోత్?
౨. జలే కిమదృశ్యత?
౩. సః వానరః కిమైచ్ఛత్?
౪. వానరః కుతః దుఃఖితోఽభవత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
అభినవ బాల నీతి కథ సప్తతి
-----------------------------
 6. కోతి, దాని నీడ కథ
          ఒక  కోతి ఒక బావి ప్రాంతంలో నిలిచి మామిడిపండును తిన్నది. అపుడే అది కిందకు వంగి బావి లోపలకు చూస్తూ ఉన్నది. అపుడు దాని ప్రతిబింబం నీటిలోకి చూసింది. దానితో వేరే కోతి ఆ నీటి లోపల మామిడిపండు తింటున్నట్టుగా దానికి కనిపించింది. అది చూసి ఈ కోతికి వేరే వానరానికి భయం కలిగించి దాని ఫలాన్ని తీసుకోవాలని కోరిక కలిగింది. అపుడు అది పెద్దగా అరిచింది. అపుడు దాని నోటిలో ఉన్న ఫలం బావిలో పడి మునిగిపోయింది. అప్పుడు ఆ వానరం ఎంతో బాధ పడింది.
          నీతి:-  వేరే వాళ్ళవి తీసుకోవాలి (లాక్కోవాలి) అనుకుంటే మనది కూడా నాశనం అవుతుంది.

No comments:

Post a Comment