3. శూద్రస్య హంసస్య చ కథా
అవన్త్యాం
కశ్చిత్ లుబ్ధః శూద్రః ఆసీత్। సః కంచన హంసం అపోషయత్। సః హంసః దినే దినే స్వర్ణమయం
అణ్డం ఉత్పాదయతి స్మ। తేన సః శూద్రః తృప్తః న అభవత్। ఏకదైవ సః సర్వాణి అణ్డాని
గ్రహీతుం ఐచ్ఛత్। అథ సః హంసం హన్తుం నిశ్చితవాన్। తథైవ సః తం హత్వా కుక్షౌ
అపశ్యత్। తత్ర కిమపి అణ్డం న ఆసీత్। అణ్డస్య దాతా హంసః చ మృతః। తేన సః నితరాం
ఖిన్నః అభవత్॥
నీతిః– అత్యాశయా
మూలస్యైవ హానిర్భవతి॥
ప్రశ్నాః-
౧. శూద్రః
కుత్ర ఆసీత్?
౨. హంసః
కిముత్పాదయతి స్మ?
౩. సః
కిమైచ్ఛత్?
౪. సః కుక్షౌ
కిమపశ్యత్?
౫. అస్యాః
కథాయాః నీతిః కా?
-----------------------------
3. శూద్రుడు, హంస కథ
అవంతిలో ఒక లోభి ఐన శూద్రుడు
ఉండేవాడు. వాడు ఒక హంసను పోషించేవాడు. ఆ హంస ప్రతిరోజూ ఒక బంగారపు గుడ్డు పెడుతూ ఉండేది.
దానితో అతడు సంతృప్తి చెందేవాడు కాదు. వాడు ఒకేసారి చాలా బంగారపు గుడ్లను తీసుకోవాలి-
అనుకున్నాడు. కనుక హంసను చంపి, దాని పొట్టలో చూశాడు.
ఒక గుడ్డు కూడా లేదు. దానితో అతను పోషించే హంస కూడా చనిపోవడంతో వాడు చాల చింతించాడు.
నీతి- అత్యాశ
వల్ల మూలనికే హాని జరుగును.
No comments:
Post a Comment