Sunday, 4 September 2016

13. ద్వీపినః గోమాయోశ్చ కథా - 13. చిరుతపులి, నక్క యొక్క కథ.

అభినవబాలనీతికథాసప్తతిః
13. ద్వీపినః గోమాయోశ్చ కథా
          కదాచిత్ కశ్చిత్ ద్వీపీ చేతసి ఏవమ్ అకరోత్। చిత్రవర్ణాన్ సున్దరాంశ్చ మద్దేహగాన్ బిన్దూన్ విలోక్య సింహోఽపి రూపే మమ సాదృశ్యం ప్రాప్తుం నాలమ్। తథా సతి మమ కే అన్యే పశవః। ఇతి। తతః సః సత్త్వమాత్రం ధిక్కృతవాన్। తాదృశం ద్వీపినం దృష్ట్వా జమ్బుకః భణతి స్మ। హే ద్వీపిన్, మహానయం తే భ్రమః। యదహం కథయామి తత్ పరమార్థతః గృహ్యతామ్। మనః సమున్నత్యాదీన్ అన్తరఙ్గగుణాన్ వినా బాహ్యగుణైః భూషణం నైవ భూషణమ్ ఇతి సన్తః స్మరన్తి। ఇతి॥
          నీతిః యః న కేవలం సున్దరః అపి తు గుణవాన్ స ఏవసుభగ। ఇతి ప్రథామయతే॥
ప్రశ్నాః-
౧. ద్వీపీ చేతసి కిమకరోత్?
౨. సః సత్త్వమాత్రం కుతో ధిక్కృతవాన్?
౩. జమ్బుకః కిం భణతి స్మ?
౪. సన్తః కిం స్మరన్తి?
౫. అస్యాః కథాయాః నీతిః కా?

--------------------------------
అభినవ బాల నీతి కథా సప్తతి
13. చిరుతపులి, నక్క యొక్క కథ.

          ఒకసారి ఒక చిరుతపులి తన మనస్సులో ఈ విధంగా అనుకుంది. "ఈ శరీరం మీద రంగురంగుల వర్ణాలతో, సుందరంగా ఉన్న చుక్కలను చూసి సింహం కూడా రూపంలో నాతో సమానంగా అవ్వలేదు. (నా అంత అందాన్ని కలిగి లేదు.) అటువంటప్పుడు వేరే పశువుల గురించి చెప్పాల్సింది ఏముంది?" ఇక అది ప్రతీ జంతువును ధిక్కరించింది. అటువంటి చిరుతపులిని చూసి ఒక నక్క ఈ విధంగా అంది- ఓ చిరుతపులీ, నీకు ఉన్నది చాలా పెద్ద భ్రమ. నేను చెప్పేది పరమార్థంగా తీసుకో. మనస్సులోని ఔన్నత్యం (గొప్పతనం) మొదలైన అంతరంగగుణాలు లేకుండా బాహ్యగుణాలు భూషణంగా ఒప్పుకోము. (అంటే మనస్సులో ఉన్న ఔన్నత్యం మొదలైన అంతరంగ గుణాలే గుణాలు. ఉత్త బాహ్య గుణాలు గుణాలు కావు.) అని ఎప్పుడూ  కూడా మహాత్ములు చెప్తు ఉంటారు.అని.
          నీతి- ఎవరైతే కేవలం అందంగా ఉండటమే కాదు, గుణవంతులుగా కూడా ఉంటారో వాళ్ళే గొప్పవారిలోఅగ్రగణ్యులు.

No comments:

Post a Comment