అభినవబాలనీతికథాసప్తతిః
9. దశనశీలస్య శ్వానస్య
కథా
కశ్చిత్ శ్వానః జనాన్ అభిధావ్య తాన్ దశతి।
అస్య హేతోః తస్య స్వామీ తస్య గలే కాష్ఠమేకం బద్ధవాన్। ఏతత్ మహత్ భూషణమితి మత్వా సః
శునకః ప్రాతివేశ్యాన్ భషకాన్ తిరస్కృతవాన్। సన్నిధౌ స్థాతుమపి తాన్ న క్షమతే స్మ। తతః
తేషు కశ్చిత్ వృద్ధః తం భణతి। “తాత, గలస్థితేన అనేన అహం మహత్త్వం
ప్రాప్తః ఇతి మన్యసే చేత్ సుఖం మన్యస్వ। పరం యః ఇదం కాష్ఠం గలే బద్ధవాన్ తేన మహిమ్నః
కారణమితి నేదం బద్ధః। అపి తు లఘిమ్నః కారణమితి బద్ధ ఇదం ఇతి అహం తర్కయే।” ఇతి॥
నీతిః– సాభిమానాః క్షుద్రబుద్ధయః ఆత్మని సంస్థితం వైకల్యం స్వేషాం శ్రేయస్కరమితి
సమర్థయన్తి॥
ప్రశ్నాః-
౧. శ్వానః కిం కరోతి
స్మ?
౨. శునకః కాన్ కుతః తిరస్కృతవాన్?
౩. శునకః కిం మన్యతే
స్మ?
౪. గలే కాష్ఠబన్ధః కస్య
కారణమ్?
౫. అస్యాః కథాయాః నీతిః
కా?
-----------------------------
అభినవ బాలనీతికథా సప్తతి
కరిచే కుక్క కథ
ఒక కుక్క జనాల మీదకు ఉరికి వారిని
కరుస్తోంది. అందువల్ల దాని యజమాని దాని మెడకు (లో) ఒక కఱ్ఱ పెట్టి కట్టాడు. అదేదో
మహా భూషణమనుకొని ఆ కుక్క చుట్టుపక్కల కుక్కలను తిరస్కరించింది. అవి తన పక్కన
నిలబడటాన్ని కూడా సహించేది కాదు. అప్పుడు వాటిలో ఒక పెద్దదైన కుక్క ఇట్లా అంది-“నాయనా, ‘మెడలో ఉన్న కఱ్ఱ వల్ల నేను గొప్పతనాన్ని
పొందాను’ అని నీవు భావిస్తే.. సరే, హాయిగా
భావించుకో. కానీ ఈ కఱ్ఱ నీ మెడలో నీ గొప్పతనం కోసం కట్టబడలేదు. పైగా చిన్నతనం
కారణంగా కట్టబడింది.. అని నేను అనుకుంటున్నాను.”
నీతి- అహంకారులు అల్పబుద్దులు తమలోని
లోపాలను తమకు శ్రేయస్సు చేసేవిగా (భావించుకొని) సమర్థిస్తారు.
No comments:
Post a Comment