అభినవబాలనీతికథాసప్తతిః
24. మూషకస్య సింహకన్యాయశ్చ
కథా
కేనచిత్ మూషకేణ జాలాన్ముక్తః కశ్చన సింహః
ప్రసన్నవదనః తం మూషకం అగదత్,– “భో మూషక, త్వయా బలవత్ ఉపకృతః అస్మి।
ఈప్సితం వరయ। తే దేయమితి మే నిశ్చయః।” అనేన గర్వితః స మూషకః– “కోఽహం, కా వా మే యోగ్యతా, కిం మయా యాచనీయమ్?।” ఇతి అవిచార్య సింహం వ్యజ్ఞాపయత్। “యతః స్వామీ తుష్టః ‘ఈప్సితం వ్రియతాం’ ఇతి వదతి, తతః అహం నిర్భీకః యాచే।
మద్యాచ్ఞా చేయం యత్ స్వామినా ఆత్మనః కన్యా మే దాతవ్యేతి।” తద్వచనమ్ ఆకర్ణ్య సింహః దుర్మనాః జాతః। పరం
సః కిం కుర్యాత్। పూర్వమేవ తేన ప్రతిశ్రుతం హి। అతః– “దత్తా మయా తే కన్యా।” ఇతి ఉదీర్య సః దుహితరం ఆహ్వయత్। సా యౌవనమదమన్థరగమనా
సమాగతా। సమాగతాయాః తస్యాః ఆకస్మికేన సః మూషకేన పఞ్చత్వం గతః॥
నీతిః– యోగ్యతానుసారం ప్రార్థనా కర్తవ్యా॥
ప్రశ్నాః-
౧. సింహః కేన కిమగదత్?
౨. మూషికః గర్వితః। కథమ్?
౩. మూషికః కిం సింహం
వ్యజ్ఞాపయత్?
౪. సమాగతాయాం సింహకన్యాయం
కిమభవత్?
౫. అస్యాః కథాయాః నీతిః
కా?
-----------------------------
అభినవ బాలనీతి కథా సప్తతిః
24. ఎలుక, సింహం కూతురి కథ
ఒక ఎలుక చేత వలలోనుంచి బయటపడేయబడిన ఒక సింహం
సంతోషంతో ఆ ఎలుకతో ఈ విధంగా అంది- “ఓ ఎలుకా, నీవల్ల నేను ఏంతో ఉపకారాన్ని
పొందాను. ఏదైనా కావాలంటే కోరుకో. అది ఇవ్వాలని నిశ్చయించుకున్నాను.” అని. దానిచేత గర్వించిన
ఎలుక ‘నేను ఎవరిని, నా యోగ్యత ఏమిటి, నేను ఏమి అడగాలి?’ అని ఆలోచించకుండానే సింహంతో
ఈ విధంగా అంది- “నా యజమాని సంతోషంగా ఉన్నాడు కనుక, కోరుకున్నది ఇస్తాను
అంటున్నాడు కనుక నేను భయం లేకుండా అడుగుతున్నాను. నేను అడిగేది ఏమిటంటే నా స్వామియొక్క
కూతుర్ని నాకు ఇవ్వాలి” అని. ఆ వచనాన్ని విని సింహం చాలా కోపం తెచ్చుకుంది
కాని ఏం చెయ్యాలి? అది మొదలే మాట ఇచ్చేసింది. అందువల్ల “సరే, నీకు నా కూతుర్ని ఇస్తున్నాను,” అని తన కూతుర్ని పిలిచింది
సింహం. యౌవన మదంలో ఉన్న ఆ సింహం కూతురు అక్కడికి వచ్చింది. అది వస్తుంటే ఆ ఆకస్మిక
రాకతోటి ఎలుక అక్కడే చచ్చిపోయింది.
నీతి- తన యోగ్యతను అనుసరించి వరం కోరుకోవాలి.
No comments:
Post a Comment