Sunday, 4 September 2016

19. సముచ్ఛ్రితవృక్షస్య నిమ్నవృక్షస్య చ కథా - 19. ఎత్తైన చెట్టు, చిన్న చెట్టు కథ.

అభినవబాలనీతికథాసప్తతిః
19. సముచ్ఛ్రితవృక్షస్య నిమ్నవృక్షస్య చ కథా
          ఏకదా నదీకూలే రూఢస్య వాత్యాబలేన ఉన్మూలితస్య స్రోతసి మహతా వేగేన ఉహ్యమానస్య చ కస్యచిత్ సముచ్ఛ్రితవృక్షస్య వీరుధః కంచన నిమ్నతరుం సమాకర్షత్। పరం సః నీచతరుః నిరాబాధః ఏవ ఆసీత్। తతః సః సముచ్ఛ్రితః భూరుహః తం నతం మహీరుహం సాశ్చర్యం పృచ్ఛతి స్మ। కిం భోః ప్రబలయా యయా వాత్యయా మాదృశా అపి ఉన్మూలితాః తస్యాం త్వయా కథం ఆత్మానం రక్షితః। ఇతి। తతః సః నిమ్నవృక్షః తం ప్రత్యవదత్,– “మామ, ఆవయోః ఉభయోః వర్తనం భిన్నమ్। ప్రచణ్డే మారుతే సఞ్చలితే అహం నీచైః ప్రణమామి। బలీయసా స్పర్ధా నిష్ఫలేతి అహం బోధామి। త్వం తు ఆత్మనః బలే విశ్వస్య సదర్పం అశిథిలః తిష్ఠసి। ఇతి॥
          నీతిః యస్యాగతః వయం స్థాతుం అసమర్థాః తం ప్రతి ప్రణతిరేవ శ్రేయస్కరీ। తత్ర అపలేపః అనర్థకారకః॥
ప్రశ్నాః-
౧. ఏకదా నదీకూలే కిమభవత్?
౨. సముచ్ఛ్రతః భూరుహః తం నతం మహీరుహం కిమపృచ్ఛత్?
౩. నిమ్నవృక్షః ప్రచణ్డే మారుతే కిం కరోతి?
౪. కిం సః బోధతి?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
--------------------------------
అభినవబాల నీతి కథా సప్తతిః
19. ఎత్తైన చెట్టు, చిన్న చెట్టు కథ.
          ఒకసారి ఒక నదీ తీరంలో ఉన్న ఒక చెట్టు, గట్టి తుఫాను (తాకిడికి) బలంతోటి వేళ్ళతో సహా పెకిలించుకుపోయి, నదీప్రవాహంలో చాలా వేగంతో కొట్టుకొని వచ్చి, ఒక చిన్న చెట్టుని ఢీకొన్నది. అప్పుడు ఆ చిన్నచెట్టు మాత్రం చెక్కు చెదరకుండా అట్లాగే నిలిచి ఉంది. అప్పుడు ఆ పెద్ద చెట్టు యొక్క కొమ్మ దానిముందర వంగి ఉన్న ఆ చిన్ని చెట్టుని చూసి ఆశ్చర్యంగా ఇట్లా అడిగింద- ఏమిటోయ్, ప్రబలంగా ఉన్న ఆ తుఫాను చేత నాలాంటి వాళ్ళు కూడా వేళ్ళతో సహా పెకలించుకు పోతున్నారు. మరి నువ్వు నిన్ను ఎట్లా రక్షించుకున్నావు?” అని అడిగింది. అప్పుడు చిన్న చెట్టు ఈ విధంగా చెప్పింది- ఓ మామా, మన ఇద్దరి ప్రవర్తన మధ్యలో చాలా భిన్నత ఉంది.  బాగా ప్రచండమైన గాలి వచ్చినప్పుడు నేను కిందకు వంగి నమస్కరిస్తాను. బలవంతుడి తోటి పోటీ పడితే ఏ ఫలితము లేదని నాకు తెలుసు. నువ్వు నీ బలంలో విశ్వాసం ఉంచి, దర్పంతో కదలకుండా నిలబడతావు.అని అంది.
          నీతి- ఎవరైనా ఎదుటకు వచ్చినప్పుడు మనం నిలబడటానికి అసమర్థులం అయినట్లైతే  వాళ్ళకు నమస్కరించి వదిలి పెట్టటమే శ్రేయస్కరం. అక్కడ గర్వం ప్రదర్శిస్తే అది అనర్థాలకు కారణం అవుతుంది.

No comments:

Post a Comment