అభినవబాలనీతికథాసప్తతిః
43. అసూయావతోః బ్రాహ్మణయోః కథా
నిషధదేశే కశ్చన దరిద్రః బ్రాహ్మణః ఆసీత్। స పరస్య ఉత్కర్షం న సహతే స్మ। కదాచిత్ స్వస్య దారిద్ర్యస్య నివృత్తయే కస్యచిత్ సరసః తీరే సః తపః చరతి స్మ। తత్ దృష్ట్వా సేర్ష్యః తస్య ప్రాతివేశికః విప్రః అపి తత్రైవ సరస్తీరే తపః అతప్యత। కస్యచిత్ కాలస్యానన్తరం శఙ్కరః సన్నిధాయ– “కిం తే అభీప్సితమ్?।” ఇతి ప్రథమం అపృచ్ఛత్। తదా సః ఏవం ప్రార్థయత– “భగవన్, మమ ప్రాతివేశికః యత్ వరయిష్యతి, తస్య ద్విగుణం మే ప్రయచ్ఛ।” ఇతి। తదాకర్ణ్య భగవాన్ ద్వితీయం గత్వా,– “భోః తపస్విః యత్త్వం వరయిష్యస తస్య ద్విగుణం తవ ప్రాతివేశికః ప్రార్థయతే। తస్మాత్ కిం త్వమపేక్షసే?।” ఇతి పృచ్ఛతి స్మ। తత్ శ్రుత్వా ద్వితీయః ఈర్ష్యావశాత్ స్వస్య హానిమపి అవిగణయ్య ఇత్థమవదత్– “స్వామిన్ మదీయం ఏకం నేత్రం అన్ధం భవతు।” ఇతి। శఙ్కరోఽపి– “తథాస్తు।” ఇతి వ్యాహృత్య అన్తర్ధానమగచ్ఛత్। అథ ద్వితీయస్య ఏకం నయనం అహీయత। ప్రథమస్య తు ద్వే అపి చక్షుషీ అహీయేతామ్। ఏవం అసూయయా ఉభౌ అపి హానిం సమపాదయతామ్॥
నీతిః– ఈర్ష్యాలవః నిజామపి హానిం న గణయన్తి॥
ప్రశ్నాః-
౧. బ్రాహ్మణః కుతః తపః చరతి స్మ?
౨. సః శఙ్కరం కిం ప్రార్థయత?
౩. ద్వితీయః కిం వరమపృచ్ఛత్?
౪. అన్తే కిమభవత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవబాలనీతికథాసప్తతి
43. అసూయాపరులైన ఇద్దరు బ్రాహ్మణుల కథ
నిషధ దేశంలో ఒక
దరిద్రుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పక్కవాడికి మంచి జరిగితే సహించలేకపొయేవాడు.
ఒకసారి తన దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఒక సరస్సు తీరంలో కూర్చుని తపస్సు
చేస్తున్నాడు. అది చూసి ఈర్ష్యతో అతడి పక్కింటి బ్రాహ్మణుడు కూడా ఆ సరస్సు తీరానికే
వచ్చి తపస్సు చేసుకున్నాడు. కొంతకాలం తరవాత ఈశ్వరుడు ప్రత్యక్షమై, “నీకు ఏం కావాలి?”
అని మొదటివాడిని అడిగాడు. అప్పుడు వాడు ఈ విధంగా ప్రార్ధించాడు. “భగవాన్, నా
పక్కఇంటివాడు ఏదైతే కోరుకుంటాడో, దానికి రెండు ఇంతలు నాకు ఇవ్వు.” అని. అది విని
భగవంతుడు రెండో వాడి దగ్గరకు వెళ్ళి, “ఓ తపస్వీ, నీవు ఏమి కోరుకుంటావో దానికి
రెండు ఇంతలు నీ పక్క ఇంటివాడు కోరుకున్నాడు. కనుక నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. అప్పుడు
అది విని, రెండవ వాడు ఈర్ష్యతో తన నస్టాన్ని కూడా ఆలోచించకుండా ఈ విధంగా అన్నాడు-
“ఓ స్వామి, నా కన్ను ఒకటి తీసి నన్ను అంధుడిని చేయి.” శంకరుడు “తథాస్తు” అని
అంతర్ధానం అయ్యాడు. అప్పుడు రెండవవాడికి ఒక కన్ను పోయింది. మొదటి వాడికి రెండు
కళ్ళూ పోయాయి. ఈ విధంగా అసూయతో ఇద్దరూ కూడా హానిని పొందారు.
నీతి- ఈర్ష్వాళువులు తమ హానిని కూడా పరిగణించరు.