అభినవబాలనీతికథాసప్తతిః
39. మణ్డూకస్య సృగాలస్య చ కథా
కశ్చిత్ వాచాలః నామ మణ్డూకః ఏకదా సరసః నిష్క్రమ్య ఉన్నతం స్థలం అధ్యతిష్ఠత్। తత్రస్థః సః తారస్వరేణ సర్వాన్ వనపశూన్ ఆకార్య వదతి స్మ– “భోః సత్త్వాః, ఆకర్ణయత। అహం కుశలః వైద్యః అస్మి। రోగమాత్రస్య అపోహనే ప్రభవామి।” ఇతి। ఏతావత్ ఉక్త్వా ఆత్మనః నైపుణ్యం ప్రకటయితుం వైద్యశాస్త్రేభ్యః వచనాని ఉదగిరత్। వన్యపశవః తేషాం అభిధేయం నాబోధన్। పరం అయం కోఽపి మహాన్ చికిత్సకః ఇతి తేషాం ప్రతిభాతమ్। అతః యద్యత్ సః గదతి స్మ తత్తత్ తేషాం సంమతం అభవత్। తత్ర కోఽపి జమ్బుకః ఏతత్ ఉద్ధతం వచనం న సహతే స్మ। “రే పామర, తే ముఖం సఙ్కుచితమ్। తవ వపుః కిల వికృతం నిస్తేజస్కం చ। స త్వం అన్యేషాన్ రోగాన్ దూరీకరోమి ఇతి వక్తుం కిం న లజ్జసే?।” ఇతి॥
నీతిః– యః ఆత్మనః దోషాన్ దూరీకర్తుం న శక్తః, సః అన్యస్య దోషాన్ పరిహర్తుం న యతేత॥
ప్రశ్నాః-
౧. మణ్డూకః సర్వాన్ వనపశూన్ కిం వదతి స్మ?
౨. సః తద్వచనాని కుతః ఉదగిరత్?
౩. పశూనాం కిం ప్రతిభాతమ్?
౪. జమ్బుకః కిమభణత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతి
కథా సప్తతి
39. కప్ప, నక్క యొక్క కథ
ఒక బాగా వాగుడుకాయ అయిన కప్ప ఒకసారి సరస్సునుండి బయటకు
వచ్చి ఒక ఉన్నతమైన స్థలానికి ఎక్కింది. అక్కడ నిలబడి అది పెద్ద గొంతుతో అన్ని వన్యమృగాలను పిలిచి ఈ
విధంగా అంది- “ఓ ప్రాణులారా, వినండి. నేను చాలా నేర్పరి అయిన వైద్యుడిని. రోగం మొత్తాన్ని తిసేయడంలో నాకెంతో శక్తి ఉంది.” ఈ విధంగా
చెప్పి తన నైపుణ్యాన్ని ప్రకటించడానికి వైద్యశాస్త్రం నుంచి కొన్ని మాటలు కూడా
చెప్పింది. వన్య పశువులంతా అది చెప్పింది
విన్నాయి. కానీ వాటికి ఏమీ అర్థం కాలేదు.
కానీ ఇది నిజంగానే చాలా గొప్ప వైద్యుడు అని వాటికి అనిపించింది. అందువల్ల అది ఏం చెప్పిందో అదంతా
వాటన్నింటికీ కూడా సమ్మతంగా అనిపించింది. అప్పుడు ఒక నక్క ఈ ప్రగల్భుపు మాటలను
భరించలేకపోయింది. అప్పుడు అది అంది- “ఓ పామరుడా, నీ ముఖం సంకుచితంగా, నీ శరీరం
అంతా నిస్తేజంగా, వికృతంగా ఉంది. నువ్వు ఇంకా ఇతరుల రోగాన్ని
తీరుస్తాను అనడానికి సిగ్గుగా లేదు?” అని అంది.
నీతి- ఎవరైతే తన దోషాలను దూరం చేసుకోవడంలో శక్తిలేనివాడో, వాడు ఇతరుల దోషాన్ని దూరం చేస్తానుని ప్రయత్నం చేయకూడదు.
No comments:
Post a Comment