అభినవబాలనీతికథాసప్తతిః
36. భుజంగమస్య గ్రామ్య పురుషస్య చ కథా
ఏకః గ్రామ్యః పురుషః హేమన్తే నిష్కుటే కర్మ కుర్వాణః అవర్తత। తత్ర ప్రాచీరస్య అభ్యాశే హిమోద్వేజితం వికలాఙ్గం ముహూర్తేన ముహూర్తార్ధేన వా మరిష్యన్తం ఏకం భుజఙ్గమం అపశ్యత్। తమీక్షిత్వా సః పురుషః దయార్ద్రచేతాః భూత్వా తం గృహమనయత్। నీత్వా చ సః తం భుజఙ్గం అధిశ్రయణీసవిధే వ్యక్షిపత్। తత్ర వర్తమానః సః ఉరగోఽపి తాపయోగేన లబ్ధసంజ్ఞః సఞ్జాతః। అథ సః పాపః తస్య గ్రామ్యపురుషస్య పుత్రదారానుద్దిశ్య సఫూత్కారమధావత్। తతః మహాన్ కోలాహలః సమభవత్। కలకలే ప్రవృత్తే సతి సః పురుషః కుఠారహస్తః తూర్ణమేత్య ఏకైకేన ప్రహారేణ తం చక్షుఃశ్రవసం ద్విధా కృతవాన్। ప్రహరన్నయమిదమవదత్– “రే పాపాశయ, నిధనోన్ముఖే త్వయి యః తుభ్యమసూన్ అయచ్ఛత్ తస్మై కిమయం ప్రత్యుపకారః? తవ మరణం యుక్తమేవ। అపి చమరణాదప్యధికం దణ్డం త్వమర్హసి।” ఇతి॥
నీతిః– యః హితకర్తారం అన్నదాతారం చ అపకర్తుం యతతే, స కృతఘ్నః పాపః। తస్య ముఖావలోకనమపి న శ్రేయః॥
ప్రశ్నాః-
౧. గ్రామ్యః పురుషః కమపశ్యత్?
౨. లబ్ధసంజ్ఞః ఉరగః కిమకరోత్?
౩. పురుషః కుతః తం ద్విధా కృతవాన్?
౪. ప్రహరన్నయం కిమవదత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతి
కథా సప్తతి
36. పాము, ఊరి మనిషి కథ
ఒక ఊరి మనిషి హేమంతఋతువులో ఇంటి దగ్గర చిన్న ఉపవనంలో పని చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ కంచెకు పక్కగా చలితో వణుకుతున్న, వికలాంగమైన, ఒకటో అరో ముహూర్తకాలంలో (కొన్ని నిముషాలలో) చచ్చిపోబోతున్న ఒక పామును చూశాడు. దాన్ని చూసి ఆ వ్యక్తి దయతో కూడిన మనస్సు కలిగి, దాన్ని ఇంటికి తీసుకుపోయాడు. తీసుకుపోయి, అతడు ఆ పామును పొయ్యి పక్కన ఉంచాడు. అక్కడ ఉండి ఆ పాము కూడా
ఆ వేడి వల్ల స్పృహ వచ్చినదైంది. ఇక ఆ పాపి ఆ ఊరి మనిషి
భార్యాపిల్లల వైపు బుసలు కొడుతూ ఉరికింది. దానితో చాలా గొడవైంది. గొడవయ్యేసరికి ఆ
మనిషి గొడ్డలి తీసుకొని వెంటనే వెళ్ళి ఆ పామును ఒక్క వేటుతో రెండుగా నరికాడు. నరుకుతూ ఇట్లా అన్నాడు– “ఓసీ పాపాత్మా, చావబోతున్న నీకు ప్రాణాలు
ఇచ్చి కాపాడినవాడికి ఇదేనా నీ ప్రత్యుపకారం? నీ మరణం యుక్తమే. ఇంకా మరణం కన్నా
పెద్ద శిక్ష నీకు తగినది.”
॥
నీతి– హితం చేసినవాడికి అన్నదాతకు అపకారం చేయాలని ప్రయత్నించేవాడు కృతఘ్నుడు, పాపి. వాడి ముఖం చూడటం
కూడా మంచిది కాదు. ॥
No comments:
Post a Comment