అభినవబాలనీతికథాసప్తతిః
34. బ్రాహ్మణస్య వ్యాఘ్రస్య చ కథా
ధారాపురే కశ్చిత్ బ్రాహ్మణః అవర్తత। కదాచిత్ సః పుష్పాణి ఫలాని చ అపచేతుం అరణ్యం అగచ్ఛత్। తత్ర ఏకః శార్దూలః తమనుధావ్య కణ్ఠే గృహీతవాన్। తదా స విప్రః తం నమస్కృత్య ఏవం ప్రార్థయత– “అయే పుణ్డరీక, దినానాం త్రయం యావత్ మాం కృపయా ముఞ్చ। అహం గృహం గత్వా మమ పత్నీం పుత్రాన్ బన్ధూంశ్చ దృష్ట్వా తాన్ ఆభాష్య చతుర్థే దివసే అత్రాగచ్ఛామి। తతః తవ గ్రాసః భవామి।” ఇతి। తదా సః పుణ్డరీకోఽపి– “తథైవాస్తు।” ఇతి అన్వమన్యత। తతః సః ద్విజః స్వస్య గృహం ఆగత్య సకలం అపి కార్యం నిర్వర్త్య పునః అపి వ్యాఘ్రస్య సమీపం ఆగచ్ఛత్। ద్వీపీ తు తం దృష్ట్వా నితరాం సమతుష్యత్। అథ తమేవం అవదత్– “అయే, ఈదృశం సత్యసన్ధం పురుషం కుత్ర అపి న అపశ్యమ్।” ఇతి। ఇత్థం సః తం బహుధా ప్రశస్య– “సుఖేన గచ్ఛ।” ఇతి తం వ్యసృజత్॥
నీతిః– శత్రవోఽపి సత్యవాదనం బహుమన్యన్తే॥
ప్రశ్నాః-
౧. బ్రాహ్మణః కుతః అరణ్యం అగచ్ఛత్?
౨. విప్రః శార్దూలం కిం ప్రార్థయత?
౩. పుణ్డరీకః కిమవదత్?
౪. వ్యాఘ్రః కుతః తం వ్యసృజత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతి
కథా సప్తతి
34. బ్రాహ్మణస్య వ్యాఘ్రస్య చ కథా
ధారానగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకసారి అతడు పుష్పాలు ఫలాలు కోయటానికి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక పులి అతడి మీదకు వచ్చి కంఠాన్ని పట్టుకుంది. అప్పుడు ఆ విప్రుడు దానికి నమస్కరించి ఈవిధంగా ప్రార్థించాడు– “ఓ పులీ, మూడు
రోజులు వరకు నన్ను కృపతో వదిలేసేయి. నేను వెళ్ళి నా భార్యను, పుత్రులను, బంధువులను చూసి వారితో మాట్లాడి నాలుగు రోజులలో ఇక్కడకు వస్తాను. నీ ఆహారాన్ని అవుతాను.” అప్పుడు
ఆ పులి కూడా– “తథైవాస్తు।” అని
అనుమతించింది. అఫ్పుడు ఆ ద్విజుడు తన ఇంటికి వచ్చి మొత్తం పని కానించుకొని మళ్ళీ పులి వద్దకు వెళ్ళాడు. పులి అతడిని చూసి చాలా సంతోషించి, అతడితో ఇట్లా అన్నది– “ఓయి, ఈవిధంగా సత్యసంధత కలిగిన వ్యక్తిని ఎక్కడా కూడా నేను చూసి ఉండలేదు.” అని.
ఈ విధంగా పులి అతడిని చాలా విధాలా ప్రశంసించి– “సుఖంగా పోయిరా।” అని అతడిని విడిచివేసింది॥
నీతిః– శత్రవులు కూడా సత్యం మాట్లాడటాన్ని ఆదరిస్తారు.॥
No comments:
Post a Comment