Thursday, 10 November 2016

35. పణ్డితస్య తస్య పుత్రయోశ్చ కథా - 35. పండితుడు అతడి ఇద్దరు పుత్రుల కథ



అభినవబాలనీతికథాసప్తతిః

35.      పణ్డితస్య తస్య పుత్రయోశ్చ కథా
          కాశ్యాం శఙ్కరః ఇతి ధనికః పణ్డితః సమవర్తత తస్య గోపాలః గోవిన్దశ్చ ఇతి పుత్రౌ ఆస్తామ్ తయోః గోపాలః అగ్రజః గోవిన్దశ్చ అనుజః సః పణ్డితః గోపాలం కామపి విద్యాం వా కలాం వా నాపాఠయత్ తస్మాత్ సః మూఢః అవర్తత గోవిన్దస్తు విద్యాః కలాశ్చ అభ్యస్య తాసు నిపుణః అభవత్ ఏవం స్థితే, తస్య పణ్డితస్య మరణకాలః సన్నిహితః తదానీం సః పణ్డితః మూఢాయ గోపాలాయ సకలమపి స్వీయం ధనమయచ్ఛత్ గోవిన్దాయ తు కిమపి దత్తవాన్ అథ పితరి స్వర్గతే, సః గోపాలః కతిపయైరేవ దివసైః సకలమపి పిత్ర్యం ధనం వ్యయయిత్వా దరిద్రః సమభవత్ గోవిన్దస్తు ఆత్మనః పాణ్డిత్యేన అమితం ద్రవ్యం సమ్పాద్య సుఖేన కాలం అనయత్
          నీతిఃవిద్యావాన్ వా కలావాన్ వా సుఖీభవతి విద్యయా వా కలయా వా విహీనః సుఖమేధతే
ప్రశ్నాః-
.       గోవిన్దస్య పుత్రౌ కౌ?
.       గోవిన్దః కుత్ర నిపుణః?
.       పితరి స్వర్గతే గోపాలస్య కిమభవత్?
.       గోవిన్దఃకథం కాలమనయత్?
.       అస్యాః కథాయాః నీతిః కా?


-----------------------------


అభినవ బాలనీతి కథా సప్తతి

35. పండితుడు అతడి ఇద్దరు పుత్రుల కథ
          కాశీలో శంకరుడు అనే ధనికుడైన పండితుడు ఉండేవాడు. అతడికి గోపాలుడు, గోవిందుడు అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు. వారిలో గోపాలుడు పెద్దవాడు. గోవిందుడు చిన్నవాడు. పండితుడు గోపాలుడికి విద్యనూ, కళనూ నేర్పలేదు. అందువల్ల వాడు మూఢుడుగా అయినాడు. గోవిందుడు విద్యలు కళలు అభ్యసించి వాటిలో నిపుణుడు అయినాడు. అటువంటి స్థితిలో పండితుడికి మరణకాలం సమీపించింది. అప్పుడు పండితుడు మూఢుడైన గోపాలుడికి తన యావదాస్తిని ఇచ్చాడు. గోవిందుడికి ఏమీ ఇవ్వలేదు. ఇక తండ్రి స్వర్గానికి పోయాక, గోపాలుడు కొన్ని రోజులకే మొత్తం పిత్రార్జిత ధనమంతా ఖర్చుచేసేసి దరిద్రుడిగా అయినాడు. గోవిందుడు తన పాండిత్యంతో చాలా ధనాన్ని సంపాదించి సుఖంగా కాలం గడిపాడు.
          నీతిఃవిద్యావంతుడు లేదా కళావంతుడు సుఖంగా ఉంటాడు. విద్య కానీ, కళ కానీ లేనివాడు సుఖాన్ని పొందడు.

No comments:

Post a Comment