అభినవబాలనీతికథాసప్తతిః
42. దుర్దుర్యాః వృషభస్య చ కథా
కశ్చిత్ వృషభః జాతు శాద్వలే ఆచరత్। తత్ర కూర్దమానానాం అల్పకాయానాం దుర్దురశిశూనాం మధ్యే ఏకః తస్య వృషస్య పాదభారేణ ఆక్రాన్తః అమ్రియత। అపరే శిశవః గృహానాగత్య తస్య వృషస్య చేష్టితం మాత్రే న్యవేదయన్। అథ తే మాతరం అగదన్ చ–
“మాతః అద్య యావత్ ఈదృశం మహాకాయం సత్త్వం వయం న దృష్టవన్తః।” ఇతి। తత్ శ్రుత్వా సా దుర్దురీ ఉదరమీషదాధ్మాయ తాన్ శిశూన్ అపృచ్ఛత్– “కిం ఏతావాన్ సః సత్త్వః ఆసీత్?।” ఇతి। అథ తైః ఉక్తం– “ఏతస్మాదపి సః మహత్తరః అభవత్।” ఇతి। తత్ ఆకర్ణ్య పునరపి ఆధ్మాతుం ప్రవృత్తా సా భేకీ– “కిమేతావాన్ సః?।” ఇతి అపృచ్ఛత్। తే అవదన్– “మాతః ఉదరస్ఫుటనం యావత్ ఆధ్మాతాపి త్వం తేన సమత్వం నాప్స్యసి।” ఇతి। తతః అఖర్వేణ గర్వేణ ఆధ్మాతా సతీ సా తపస్వినీ భేకీ ఉదరం స్ఫుటిత్వా పఞ్చత్వం అగచ్ఛత్॥
నీతిః– నిర్ధనేన స్వసామర్థ్యం సమ్యక్ పరిచ్ఛిద్య వ్యయః కార్యః, శ్రీమతా సార్ధం స్పర్ధాం కర్తుం ఉద్యతః చేత్ సః దుర్దురీవ నశ్యేత్॥
ప్రశ్నాః-
౧. దుర్దరీశిశుః కథ అమ్రియత?
౨. దుర్దరీశిశవః మాతరం కిమవదన్?
౩. భేకీ కిమకరోత్?
౪. అన్తే కిమభవత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతికథా సప్తతి
42. ఆడ కప్ప, వృషభముల యొక్క కథ
ఒక ఎద్దు ఒకసారి మెత్తటి గడ్డిలో తిరుగుతూ మేస్తూ ఉంది. అప్పుడు
అక్కడ ఎగురుతున్న చిన్న శరీరాలు కల కప్ప పిల్లలలోంచి ఒకటి ఎద్దు పాదం కింద ఆ బరువుకు నలిగి చచ్చిపోయింది. మిగతా పిల్లలు
అన్నీ ఇంటికి చేరి ఆ ఎద్దు (చేసిన) పనిని తల్లికి చెప్పాయి. అప్పుడు అవి తల్లితో ఈ
విధంగా అన్నాయి- “అమ్మా ఇవాళ ఎంత పెద్ద శరీరం కల ప్రాణిని మేము చూసామో తెలుసా?” అని.
అది విని ఆడ కప్ప తన పొట్టను కొంచెం పెంచి తన పిల్లలను అడిగింది- “ఆ ప్రాణి ఇంత
పెద్దగా ఉందా?” అని. అప్పుడు అవి అన్నాయి- “కాదు ఇంతకన్నా పెద్దగా ఉంది.” అప్పుడు
అది విని ఆ ఆడ కప్ప మళ్ళీ పొట్టను పెంచి, “ఇంత పెద్దగా ఉందా?” అని అడిగింది. అప్పుడు
అవి అన్నాయి- “అమ్మా ! నీ పొట్ట అంతా పెరిగి పగిలిపోయేదాకా నువ్వు పెంచినా కూడా ఆ
ప్రాణితో సమంగా నువ్వు చేయలేవు.” అని. అప్పుడు కూడా ఆగని గర్వంతో పొట్ట పెంచుతూ పోయి,
ఆ పిచ్చి ఆడ కప్ప తన పొట్ట పగిలిపోయి చచ్చిపోయింది.
నీతి- నిర్ధనుడు తన సామర్ధ్యం బాగా
తెలుసుకుని ఖర్చు పెట్టుకోవాలి. గొప్పవాళ్ళతో పోటీ పెట్టుకుంటే అప్పుడు ఆ కప్పలాగే
నశిస్తాడు.
No comments:
Post a Comment