అభినవబాలనీతికథాసప్తతిః
41. చటకాయాః శశకస్య చ కథా
కోఽపి గరుడః ఏకం శశం కృకాటికాగ్రహణేన రుద్ధవాన్। తదా తదభ్యాశవర్తిని కస్మింశ్చిత్ శాఖిని సమాసీనా కాచిత్ చటకా తం శశకం అభణత్– “రే త్వమతీవ విచారమూఢః। ధిక్ తే జీవితమ్। రే,
త్వం నిష్క్రియః సన్ కిమాత్మానం వ్యర్థం ఘాతయసి? త్తిష్ఠ, ధావ చ। యది యతసే, తర్హి చపలజాతిః త్వం అరేః హస్తాత్ ముచ్యేథాః ఇతి మే మతిః।” ఇతి। ఇత్థం సనికారం తస్యాం వదన్త్యామేవ కశ్చిత్ శశాదనః అవపత్య తాం నఖైః ఉదనయత్। తస్మిన్ క్షణే సా అతిమాత్రం ప్రలపతి స్మ। పరం తస్మిన్ అధత్తావధానః శ్యేనః తాం గృహీత్వా అచలత్। తత్ దృష్ట్వా శశః మృతికాలే సమాహితచిత్తః తాం అవదత్– “అయే ఆత్మానం సుస్థాం మన్యమానా భవతీ మాం అధ్యక్షిపత్। సా త్వం తేనైవ భయహేతునా ఆక్రాన్తా। పశ్యాని కథమేతర్హి వర్తసే।” ఇతి॥
నీతిః– యే పరోపదేశే పణ్డితాః యే చ ఆత్మనః సమాపతితే వ్యసనే బుద్ధిభ్రంశం అధిగచ్ఛన్తి, తే లోకే ఉపహస్యన్తే॥
ప్రశ్నాః-
౧. కః కం రుద్ధవాన్?
౨. శశకః కిమభణత్?
౩. చటకాయాః కిమభవత్?
౪. శశః అన్తే కిమవదత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతికథా సప్తతి
41. పిచ్చుక, కుందేలు
కథ
ఒక గద్ద ఒక కుందేలును
మెడ వెనక నొక్కేసి పట్టేసుకుంది. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక కొమ్మపై కూర్చుని ఉన్న
ఒక పిచ్చుక ఆ కుందేలును చూసి ఈ విధంగా అంది- “ఒరేయ్, నువ్వు చాలా ఆలోచన లేని
వాడివి. ధిక్, నీ జీవితం!!
ఒరేయ్, నువ్వు పనిలేని వాడివి. నిన్ను నువ్వు వ్యర్థంగా చంపుకుంటున్నావు. నిలువు,
పరిగెత్తు. ఒకవేళ ప్రయత్నిస్తే ఈ గద్ద తన చేతి నుండి నిన్ను వదిలి పెట్టే అవకాశం
ఉంది అని నా ఆభిప్రాయం.” అని అంది. ఈ విధంగా హేళనగా దానితో అంటూ ఉండగా ఒక డేగ
వచ్చి దాన్ని తన గోళ్ళతో పైకి లేపింది. ఆ క్షణంలో అది గట్టిగా అరిచింది. కానీ ఆ
అరుపులను డేగ ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది. అది చూసి
కుందేలు తన చావు సమీపిస్తుండగా సమాహితచిత్తుడై ఈ విధంగా అంది- “ఓయి, నిన్ను నువ్వు
చాలా హాయిగా ఉన్నాను అని అనుకుంటూ నన్ను ఆక్షేపించావు. అటువంటి నీవు ఇవాళ అదే హాని
చేసే హేతువు చేత పట్టుకోబడ్డావు. అయితే నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తాను.” అని.
నీతి- ఎవరైతే ఇతరులకు సలహాలు ఇవ్వడంలో పండితులుగా ఉంటారో,
వారికి కష్టం వచ్చినప్పుడు అదే బుద్ది భ్రంశాన్ని పొందుతారు. అటువంటి వాళ్ళు
లోకంలో అపహాస్యం పాలు అవుతారు.
No comments:
Post a Comment