Thursday, 10 November 2016

37. కూర్మస్య గరుడస్య చ కథా - 37. తాబేలు గరుడ పక్షి కథ



అభినవబాలనీతికథాసప్తతిః
37.  కూర్మస్య గరుడస్య కథా
            కశ్చిత్ కూర్మః భూమౌ గతాగతైః నిర్వేదం ఆపన్నః ఆకాశచారీ భూత్వా ఇతః తతః స్థితానాం సృష్టిచమత్కారాణాం రామణీయకం పశ్యేయమితి ఇచ్ఛా తస్య మనసి ఉత్పన్నా సః సర్వాన్ పక్షిణః అభాషత,– “యో మాం వియత్పథా నీత్వా సృష్టిసౌన్దర్యం దర్శయేత్, తస్మై అహం భూగర్భాన్తర్గతాః మమ జ్ఞాతాః రత్నఖనీః దర్శయేయమ్ఇతి ఏతత్ శ్రుత్వా గరుడః తం కచ్ఛపం గగనం నీత్వా భూగోలవర్తినః నిఖిలాన్ చమత్కారాన్ అదర్శయత్ తతః తార్క్ష్యః కమఠమభణత్,– “భోః కుత్ర ఇదానీం తే రత్నాకరాః? తాన్ దర్శయ తూర్ణమ్ఇతి తదా కూర్మః భ్రాన్తచిత్తవత్ వ్యవహర్తుం ప్రావర్తత తత్ ఉదీక్ష్య ఖగేశ్వరః అక్రుధ్యత్ తస్య నర్మసు నఖాన్ వ్యాపార్య తం హతవాన్
            నీతిఃయది ప్రతిజ్ఞా నోత్తీర్యతే తర్హి హానిః జాయతే
ప్రశ్నాః-
.       కూర్మస్య మనసి కా ఇచ్ఛా ఉత్పన్నా?
.       సః సర్వాన్ పక్షిణః కిమభాషత?
.       గరుడః కిమకరోత్?
.       కుతః గరుడః కూర్మం హతవాన్?
.       అస్యాః కథాయాః నీతిః కా?

-----------------------------
అభినవ బాలనీతి కథా సప్తతి
37. తాబేలు గరుడ పక్షి కథ
ఒక తాబేలు భూమిపై వస్తూ పోతూండటాలతో (ఉండటంతో) నిర్వేదం (అనాసక్తి) చెందింది. ఆకాశచారి అయి (ఆకాశంలో ఎగురుతూ) అక్కడా ఇక్కడా ఉండే సృష్టిచమత్కారాలు, రమణీయ దృశ్యాలను చూడాలి అని దాని మనసులో కోరిక కలిగింది. అది అన్ని పక్షులతో మాట్లాడింది– “ఎవరు నన్ను ఆకాశమార్గంలో తీసుకుపోయి సృష్టిసౌంర్యాన్ని చూపిస్తారో, వారికి నేను భూగర్భంలో ఉన్న, నాకు తెలిసిన రత్నఖనులను చూపిస్తాను. ఇది విని గరుడుడు ఆ తాబేలును ఆకాశంలోకి తీసుకొనిపోయి భూగోలం పై ఉన్న అన్ని చమత్కారాలను చూపించింది. ఆ తరువాత ఆ గరుడపక్షి తాబేటితో అన్నది– “ఓయి, ఎక్కడ నీ రత్నాల ఖనులు? వాటిని నాకు త్వరగా చూపించు. ఇక తాబేలు మతి భ్రమించినదానిలా వ్యవహరించటం మొదలుపెట్టింది. అది చూసి ఖగేశ్వరుడైన గరుడుడికి కోపం వచ్చింది. దాని అవయవాలలోకి గోర్లను పొడిచి దాన్ని చంపేసింది.
            నీతిఃప్రతిజ్ఞ నిలుపుకోకపోతే హాని కలుగుతుంది.

No comments:

Post a Comment