Thursday, 20 October 2016

31. వ్యాఘ్రస్య ఇతరేషాం మృగాణాం చ కథా 31. పులి, ఇతర మృగాల కథ



అభినవబాలనీతికథాసప్తతిః
31. వ్యాఘ్రస్య ఇతరేషాం మృగాణాం చ కథా
          ఏకస్మిన్ అరణ్యే కశ్చన వ్యాఘ్రః అవర్తత। సః తత్రత్యాన్ అన్యాన్ మృగాన్ బాధమానః ఆసీత్। ఏవం మహాన్ కాలః గతః। కదాచిత్ సః వ్యాఘ్రః ఏకం వృషభం ఉద్దిశ్య ఉదపతత్। తదా సః శార్దూలః లక్ష్యాత్ స్ఖలిత్వా పురతః స్థితే అగాధే గర్తే న్యపతత్। ఏవం పతితం తం దృష్ట్వా సర్వే అపి తే మృగాః సఙ్ఘీభూయ ఇత్థం ఆలోచయన్– “యది వయం ఏనం ఇదానీం న సంహరామః తర్హి ఏష పాపః అస్మాన్ సర్వదా పీడయేదేవ। తస్మాత్ అస్మిన్ కాలే ఏవ అయం మారణీయః।ఇతి। ఏవం సమాలోచ్య సర్వే అపి తే మృగాః ఏకైకం పాషాణం ఉద్ధృత్య తస్య వ్యాఘ్రస్య ఉపరి అపాతయన్। తైః పాషాణైః సః గర్తః అపూర్యత। తేన స వ్యాఘ్రః అపి అమ్రియత॥
          నీతిఃబహుభిః విరోధః న కర్తవ్యః॥
ప్రశ్నాః-
౧.       వ్యాఘ్రః కిం కరోతి స్మ?
౨.       వ్యాఘ్రః కథం అగాధే గర్తే అపతత్?
౩.       మృగాః కిమాలోచయన్?
౪.       అన్తే కిమభవత్?
౫.       అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
 
అభినవ బాలనీతికథా సప్తతి
31. పులి, ఇతర మృగాల కథ
          ఒక అరణ్యంలో ఒక పులి ఉండేది. అది అక్కడ ఉండే అన్య మృగాలను బాధిస్తూ ఉండేది. ఇట్లా చాలాకాలం గడిచింది. ఒకసారి ఆ పులి ఒక ఎద్దును ఉద్దేశించి (తినాలని) లంఘించింది. అప్పుడు ఆ పులి లక్ష్యం తప్పి ఎదురుగా ఉన్న అగాధం (పెద్ద లోతైన గుంట)లో పడిపోయింది. ఈ విధంగా పడిన దాన్ని చూసి, అన్నీ మృగాలు కలిసి ఇట్లా ఆలోచించినవి– “ఒకవేళ మనం దీన్ని ఇప్పుడు సంహరించకపోతే ఈ పాపాత్మమైనది మనలను ఎల్లప్పటికీ పీడిస్తుంది. అందువల్ల ఈ వేళే ఇది చంపబడాలి.అని. ఈవిధంగా ఆలోచించి అన్ని మృగాలు ఒక్కొక్క రాయిని తీసుకొని ఆ వ్యాఘ్రం మీద విసిరాయి. ఆ రాళ్ళ చేత ఆ గుంట అంతా నిండిపోయింది. దానితో ఆ పులి కూడా చచ్చిపోయింది.
          నీతిఃఎక్కువ మందితో విరోధం పెట్టుకోరాదు.

30. కాకస్య జమ్బుకస్య చ కథా 30. కాకి నక్క కథ



అభినవబాలనీతకథాసప్తతిః
30. కాకస్య జమ్బుకస్య చ కథా
          కశ్చన కాకః ఏకం మాంసస్య ఖణ్డం చఞ్చ్వా గృహీత్వా కస్యచన వృక్షస్య శాఖాయాం ఉపావిశత్। అత్రాన్తరే కశ్చిత్ సృగాలః తస్య వృక్షస్య మూలమగచ్ఛత్. అథ సః జమ్బుకః తం ఖండం కాకస్య చఞ్చౌ అపశ్యత్। యదా అసౌ తం దృష్టవాన్ తదా అసౌ తం హర్తుమ్ ఐచ్ఛత్। తతః అసౌ తం వాయసం ఇత్థం స్తోతుం ఆరభత– “హే కాక, తవ రూపం అతిసున్దరం వర్తతే। తవ స్వరః అపి మధురః ఏవ భవేత్। తస్మాత్ తవ గానం శ్రోతుం ఇచ్ఛామి।ఇతి। తాం స్తుతిం ఆకర్ణ్య కాకః అపి సగర్వం రటితుం ఆరభతే స్మ। తదా సః మాంసస్య ఖణ్డః భూమౌ న్యపతత్। సృగాలః తం గృహీత్వా పలాయత। కాకః తు నితరాం ఖిన్నః అభవత్॥
          నీతిఃపురుషః స్తుత్యా వఞ్చ్యతే॥
ప్రశ్నాః-
౧.       కాకః కిం గృహీత్వా కుత్రోపవిశత్?
౨.       సృగాలః కిమైచ్ఛత్?
౩.       సృగాలః కిం స్తోతుమారభత?
౪.       అన్తే కిమభవత్?
౫.       అస్యాః కథాయాః నీతిః కా?

-----------------------------

అభినవ బాలనీతకథా సప్తతి

30. కాకి నక్క కథ
          ఒక కాకి ఒక మాంసఖండాన్ని ముక్కుతో పట్టుకొని ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. అంతలోకి ఒక నక్క ఆ చెట్టు మూలానికి వచ్చింది. అప్పుడు ఆ నక్క ఆ (మాంసపు) ముక్కను కాకి ముక్కులో ఉండటం చూసింది. దాన్ని చూసిన వెంటనే దాన్ని హరించాలని అనుకొంది. ఇక అది ఆ కాకిని ఈ విధంగా పొగడటం ప్రారంభించింది– “ఓ కాకీ, నీ రూపం అతిసుందరంగా ఉన్నది. నీ స్వరం కూడా  మధురంగా ఉంది. అందుచేత నీ గానం వినాలనుకుంటున్నాను.ఆ పొగడ్తను విని కాకి కూడా (పొంగిపోయి) గర్వంతో అరవటం ప్రారంభించింది. ఇక ఆ మాంసం ముక్క భూమిపై పడిపోయింది. నక్క దాన్ని తీసుకొని పారిపోయింది. కాకి చాలా ఖిన్నురాలైంది.
          నీతిఃమనిషి పొగిడి వంచిస్తాడు.
-----------------------------