అభినవబాలనీతికథాసప్తతిః
31. వ్యాఘ్రస్య ఇతరేషాం మృగాణాం చ
కథా
ఏకస్మిన్
అరణ్యే కశ్చన వ్యాఘ్రః అవర్తత। సః తత్రత్యాన్ అన్యాన్ మృగాన్ బాధమానః ఆసీత్। ఏవం
మహాన్ కాలః గతః। కదాచిత్ సః వ్యాఘ్రః ఏకం వృషభం ఉద్దిశ్య ఉదపతత్। తదా సః శార్దూలః
లక్ష్యాత్ స్ఖలిత్వా పురతః స్థితే అగాధే గర్తే న్యపతత్। ఏవం పతితం తం దృష్ట్వా
సర్వే అపి తే మృగాః సఙ్ఘీభూయ ఇత్థం ఆలోచయన్– “యది వయం ఏనం ఇదానీం న సంహరామః తర్హి ఏష
పాపః అస్మాన్ సర్వదా పీడయేదేవ। తస్మాత్ అస్మిన్ కాలే ఏవ అయం మారణీయః।” ఇతి। ఏవం
సమాలోచ్య సర్వే అపి తే మృగాః ఏకైకం పాషాణం ఉద్ధృత్య తస్య వ్యాఘ్రస్య ఉపరి అపాతయన్।
తైః పాషాణైః సః గర్తః అపూర్యత। తేన స వ్యాఘ్రః అపి అమ్రియత॥
నీతిః– బహుభిః విరోధః
న కర్తవ్యః॥
ప్రశ్నాః-
౧. వ్యాఘ్రః కిం కరోతి స్మ?
౨. వ్యాఘ్రః కథం అగాధే గర్తే అపతత్?
౩. మృగాః కిమాలోచయన్?
౪. అన్తే కిమభవత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతికథా సప్తతి
31. పులి, ఇతర మృగాల కథ
ఒక
అరణ్యంలో ఒక పులి ఉండేది. అది అక్కడ ఉండే అన్య మృగాలను బాధిస్తూ ఉండేది. ఇట్లా
చాలాకాలం గడిచింది. ఒకసారి ఆ పులి ఒక ఎద్దును ఉద్దేశించి (తినాలని) లంఘించింది. అప్పుడు
ఆ పులి లక్ష్యం తప్పి ఎదురుగా ఉన్న అగాధం (పెద్ద లోతైన గుంట)లో పడిపోయింది. ఈ
విధంగా పడిన దాన్ని చూసి, అన్నీ మృగాలు కలిసి ఇట్లా ఆలోచించినవి– “ఒకవేళ మనం దీన్ని
ఇప్పుడు సంహరించకపోతే ఈ పాపాత్మమైనది మనలను ఎల్లప్పటికీ పీడిస్తుంది. అందువల్ల ఈ వేళే
ఇది చంపబడాలి.” అని. ఈవిధంగా
ఆలోచించి అన్ని మృగాలు ఒక్కొక్క రాయిని తీసుకొని ఆ వ్యాఘ్రం మీద విసిరాయి. ఆ రాళ్ళ
చేత ఆ గుంట అంతా నిండిపోయింది. దానితో ఆ పులి కూడా చచ్చిపోయింది.॥
నీతిః– ఎక్కువ మందితో
విరోధం పెట్టుకోరాదు.॥
No comments:
Post a Comment