అభినవబాలనీతకథాసప్తతిః
30. కాకస్య
జమ్బుకస్య చ కథా
కశ్చన
కాకః ఏకం మాంసస్య ఖణ్డం చఞ్చ్వా గృహీత్వా కస్యచన వృక్షస్య శాఖాయాం ఉపావిశత్।
అత్రాన్తరే కశ్చిత్ సృగాలః తస్య వృక్షస్య మూలమగచ్ఛత్. అథ సః జమ్బుకః తం ఖండం
కాకస్య చఞ్చౌ అపశ్యత్। యదా అసౌ తం దృష్టవాన్ తదా అసౌ తం హర్తుమ్ ఐచ్ఛత్। తతః అసౌ
తం వాయసం ఇత్థం స్తోతుం ఆరభత– “హే కాక, తవ రూపం అతిసున్దరం వర్తతే। తవ స్వరః అపి మధురః ఏవ భవేత్।
తస్మాత్ తవ గానం శ్రోతుం ఇచ్ఛామి।” ఇతి। తాం స్తుతిం ఆకర్ణ్య కాకః అపి సగర్వం రటితుం
ఆరభతే స్మ। తదా సః మాంసస్య ఖణ్డః భూమౌ న్యపతత్। సృగాలః తం గృహీత్వా పలాయత। కాకః తు
నితరాం ఖిన్నః అభవత్॥
నీతిః– పురుషః
స్తుత్యా వఞ్చ్యతే॥
ప్రశ్నాః-
౧. కాకః కిం గృహీత్వా కుత్రోపవిశత్?
౨. సృగాలః కిమైచ్ఛత్?
౩. సృగాలః కిం స్తోతుమారభత?
౪. అన్తే కిమభవత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతకథా సప్తతి
30. కాకి
నక్క కథ
ఒక కాకి
ఒక మాంసఖండాన్ని ముక్కుతో పట్టుకొని ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. అంతలోకి ఒక నక్క
ఆ చెట్టు మూలానికి వచ్చింది. అప్పుడు ఆ నక్క ఆ (మాంసపు) ముక్కను కాకి ముక్కులో ఉండటం
చూసింది. దాన్ని చూసిన వెంటనే దాన్ని
హరించాలని అనుకొంది. ఇక అది ఆ కాకిని ఈ విధంగా పొగడటం ప్రారంభించింది– “ఓ కాకీ, నీ రూపం అతిసుందరంగా
ఉన్నది. నీ స్వరం కూడా మధురంగా ఉంది. అందుచేత
నీ గానం వినాలనుకుంటున్నాను.” ఆ పొగడ్తను విని కాకి కూడా (పొంగిపోయి) గర్వంతో అరవటం ప్రారంభించింది.
ఇక ఆ మాంసం ముక్క భూమిపై పడిపోయింది. నక్క దాన్ని తీసుకొని పారిపోయింది. కాకి చాలా
ఖిన్నురాలైంది. ॥
నీతిః– మనిషి పొగిడి
వంచిస్తాడు.॥
-----------------------------
No comments:
Post a Comment