Thursday, 10 November 2016

43. అసూయావతోః బ్రాహ్మణయోః కథా - 43. అసూయాపరులైన ఇద్దరు బ్రాహ్మణుల కథ



అభినవబాలనీతికథాసప్తతిః

43.  అసూయావతోః బ్రాహ్మణయోః కథా
            నిషధదేశే కశ్చన దరిద్రః బ్రాహ్మణః ఆసీత్ పరస్య ఉత్కర్షం సహతే స్మ కదాచిత్ స్వస్య దారిద్ర్యస్య నివృత్తయే కస్యచిత్ సరసః తీరే సః తపః చరతి స్మ తత్ దృష్ట్వా సేర్ష్యః తస్య ప్రాతివేశికః విప్రః అపి తత్రైవ సరస్తీరే తపః అతప్యత కస్యచిత్ కాలస్యానన్తరం శఙ్కరః సన్నిధాయ– “కిం తే అభీప్సితమ్?ఇతి ప్రథమం అపృచ్ఛత్ తదా సః ఏవం ప్రార్థయత– “భగవన్, మమ ప్రాతివేశికః యత్ వరయిష్యతి, తస్య ద్విగుణం మే ప్రయచ్ఛఇతి తదాకర్ణ్య భగవాన్ ద్వితీయం గత్వా,– “భోః తపస్విః యత్త్వం వరయిష్యస తస్య ద్విగుణం తవ ప్రాతివేశికః ప్రార్థయతే తస్మాత్ కిం త్వమపేక్షసే?ఇతి పృచ్ఛతి స్మ తత్ శ్రుత్వా ద్వితీయః ఈర్ష్యావశాత్ స్వస్య హానిమపి అవిగణయ్య ఇత్థమవదత్– “స్వామిన్ మదీయం ఏకం నేత్రం అన్ధం భవతుఇతి శఙ్కరోఽపి– “తథాస్తుఇతి వ్యాహృత్య అన్తర్ధానమగచ్ఛత్ అథ ద్వితీయస్య ఏకం నయనం అహీయత ప్రథమస్య తు ద్వే అపి చక్షుషీ అహీయేతామ్ ఏవం అసూయయా ఉభౌ అపి హానిం సమపాదయతామ్
            నీతిఃఈర్ష్యాలవః నిజామపి హానిం గణయన్తి
ప్రశ్నాః-
.       బ్రాహ్మణః కుతః తపః చరతి స్మ?
.       సః శఙ్కరం కిం ప్రార్థయత?
.       ద్వితీయః కిం వరమపృచ్ఛత్?
.       అన్తే కిమభవత్?
.       అస్యాః కథాయాః నీతిః కా?

-----------------------------
అభినవబాలనీతికథాసప్తతి
43. అసూయాపరులైన ఇద్దరు బ్రాహ్మణుల కథ
     నిషధ దేశంలో ఒక దరిద్రుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పక్కవాడికి మంచి జరిగితే సహించలేకపొయేవాడు. ఒకసారి తన దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఒక సరస్సు తీరంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. అది చూసి ఈర్ష్యతో అతడి పక్కింటి బ్రాహ్మణుడు కూడా ఆ సరస్సు తీరానికే వచ్చి తపస్సు చేసుకున్నాడు. కొంతకాలం తరవాత ఈశ్వరుడు ప్రత్యక్షమై, “నీకు ఏం కావాలి?” అని మొదటివాడిని అడిగాడు. అప్పుడు వాడు ఈ విధంగా ప్రార్ధించాడు. “భగవాన్, నా పక్కఇంటివాడు ఏదైతే కోరుకుంటాడో, దానికి రెండు ఇంతలు నాకు ఇవ్వు.” అని. అది విని భగవంతుడు రెండో వాడి దగ్గరకు వెళ్ళి, “ఓ తపస్వీ, నీవు ఏమి కోరుకుంటావో దానికి రెండు ఇంతలు నీ పక్క ఇంటివాడు కోరుకున్నాడు. కనుక నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. అప్పుడు అది విని, రెండవ వాడు ఈర్ష్యతో తన నస్టాన్ని కూడా ఆలోచించకుండా ఈ విధంగా అన్నాడు- “ఓ స్వామి, నా కన్ను ఒకటి తీసి నన్ను అంధుడిని చేయి.” శంకరుడు “తథాస్తు” అని అంతర్ధానం అయ్యాడు. అప్పుడు రెండవవాడికి ఒక కన్ను పోయింది. మొదటి వాడికి రెండు కళ్ళూ పోయాయి. ఈ విధంగా అసూయతో ఇద్దరూ కూడా హానిని పొందారు.
నీతి- ఈర్ష్వాళువులు తమ హానిని కూడా పరిగణించరు.

42. దుర్దుర్యాః వృషభస్య చ కథా - 42. ఆడ కప్ప, వృషభముల యొక్క కథ



అభినవబాలనీతికథాసప్తతిః 
42. దుర్దుర్యాః వృషభస్య కథా

            కశ్చిత్ వృషభః జాతు శాద్వలే ఆచరత్ తత్ర కూర్దమానానాం అల్పకాయానాం దుర్దురశిశూనాం మధ్యే ఏకః తస్య వృషస్య పాదభారేణ ఆక్రాన్తః అమ్రియత అపరే శిశవః గృహానాగత్య తస్య వృషస్య చేష్టితం మాత్రే న్యవేదయన్ అథ తే మాతరం అగదన్ – “మాతః అద్య యావత్ ఈదృశం మహాకాయం సత్త్వం వయం దృష్టవన్తఃఇతి తత్ శ్రుత్వా సా దుర్దురీ ఉదరమీషదాధ్మాయ తాన్ శిశూన్ అపృచ్ఛత్– “కిం ఏతావాన్ సః సత్త్వః ఆసీత్?ఇతి అథ తైః ఉక్తం– “ఏతస్మాదపి సః మహత్తరః అభవత్ఇతి తత్ ఆకర్ణ్య పునరపి ఆధ్మాతుం ప్రవృత్తా సా భేకీ– “కిమేతావాన్ సః?ఇతి అపృచ్ఛత్ తే అవదన్– “మాతః ఉదరస్ఫుటనం యావత్ ఆధ్మాతాపి త్వం తేన సమత్వం నాప్స్యసిఇతి తతః అఖర్వేణ గర్వేణ ఆధ్మాతా సతీ సా తపస్వినీ భేకీ ఉదరం స్ఫుటిత్వా పఞ్చత్వం అగచ్ఛత్
            నీతిఃనిర్ధనేన స్వసామర్థ్యం సమ్యక్ పరిచ్ఛిద్య వ్యయః కార్యః, శ్రీమతా సార్ధం స్పర్ధాం కర్తుం ఉద్యతః చేత్ సః దుర్దురీవ నశ్యేత్
ప్రశ్నాః-
.       దుర్దరీశిశుః కథ అమ్రియత?
.       దుర్దరీశిశవః మాతరం కిమవదన్?
.       భేకీ కిమకరోత్?
.       అన్తే కిమభవత్?
.       అస్యాః కథాయాః నీతిః కా?

-----------------------------
 అభినవ బాలనీతికథా సప్తతి
 42. ఆడ కప్ప, వృషభముల యొక్క కథ
    ఒక ఎద్దు ఒకసారి మెత్తటి గడ్డిలో తిరుగుతూ మేస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఎగురుతున్న చిన్న శరీరాలు కల కప్ప పిల్లలలోంచి ఒకటి ఎద్దు పాదం కింద ఆ  బరువుకు నలిగి చచ్చిపోయింది. మిగతా పిల్లలు అన్నీ ఇంటికి చేరి ఆ ఎద్దు (చేసిన) పనిని తల్లికి చెప్పాయి. అప్పుడు అవి తల్లితో ఈ విధంగా అన్నాయి- “అమ్మా ఇవాళ ఎంత పెద్ద శరీరం కల ప్రాణిని మేము చూసామో తెలుసా?” అని. అది విని ఆడ కప్ప తన పొట్టను కొంచెం పెంచి తన పిల్లలను అడిగింది- “ఆ ప్రాణి ఇంత పెద్దగా ఉందా?” అని. అప్పుడు అవి అన్నాయి- “కాదు ఇంతకన్నా పెద్దగా ఉంది.” అప్పుడు అది విని ఆ ఆడ కప్ప మళ్ళీ పొట్టను పెంచి, “ఇంత పెద్దగా ఉందా?” అని అడిగింది. అప్పుడు అవి అన్నాయి- “అమ్మా ! నీ పొట్ట అంతా పెరిగి పగిలిపోయేదాకా నువ్వు పెంచినా కూడా ఆ ప్రాణితో సమంగా నువ్వు చేయలేవు.” అని. అప్పుడు కూడా ఆగని గర్వంతో పొట్ట పెంచుతూ పోయి, ఆ పిచ్చి ఆడ కప్ప తన పొట్ట పగిలిపోయి చచ్చిపోయింది.
నీతి- నిర్ధనుడు తన సామర్ధ్యం బాగా తెలుసుకుని ఖర్చు పెట్టుకోవాలి. గొప్పవాళ్ళతో పోటీ పెట్టుకుంటే అప్పుడు ఆ కప్పలాగే నశిస్తాడు.

41. చటకాయాః శశకస్య చ కథా - 41. పిచ్చుక, కుందేలు కథ



అభినవబాలనీతికథాసప్తతిః
41. చటకాయాః శశకస్య కథా
            కోఽపి గరుడః ఏకం శశం కృకాటికాగ్రహణేన రుద్ధవాన్ తదా తదభ్యాశవర్తిని కస్మింశ్చిత్ శాఖిని సమాసీనా కాచిత్ చటకా తం శశకం అభణత్– “రే త్వమతీవ విచారమూఢః ధిక్ తే జీవితమ్ రే, త్వం నిష్క్రియః సన్ కిమాత్మానం వ్యర్థం ఘాతయసి? త్తిష్ఠ, ధావ యది యతసే, తర్హి చపలజాతిః త్వం అరేః హస్తాత్ ముచ్యేథాః ఇతి మే మతిఃఇతి ఇత్థం సనికారం తస్యాం వదన్త్యామేవ కశ్చిత్ శశాదనః అవపత్య తాం నఖైః ఉదనయత్ తస్మిన్ క్షణే సా అతిమాత్రం ప్రలపతి స్మ పరం తస్మిన్ అధత్తావధానః శ్యేనః తాం గృహీత్వా అచలత్ తత్ దృష్ట్వా శశః మృతికాలే సమాహితచిత్తః తాం అవదత్– “అయే ఆత్మానం సుస్థాం మన్యమానా భవతీ మాం అధ్యక్షిపత్ సా త్వం తేనైవ భయహేతునా ఆక్రాన్తా పశ్యాని కథమేతర్హి వర్తసేఇతి
            నీతిఃయే పరోపదేశే పణ్డితాః యే ఆత్మనః సమాపతితే వ్యసనే బుద్ధిభ్రంశం అధిగచ్ఛన్తి, తే లోకే ఉపహస్యన్తే
ప్రశ్నాః-
.       కః కం రుద్ధవాన్?
.       శశకః కిమభణత్?
.       చటకాయాః కిమభవత్?
.       శశః అన్తే కిమవదత్?
.       అస్యాః కథాయాః నీతిః కా?

-----------------------------
అభినవ బాలనీతికథా సప్తతి 
41. పిచ్చుక, కుందేలు కథ
 ఒక గద్ద ఒక కుందేలును మెడ వెనక నొక్కేసి పట్టేసుకుంది. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక కొమ్మపై కూర్చుని ఉన్న ఒక పిచ్చుక ఆ కుందేలును చూసి ఈ విధంగా అంది- “ఒరేయ్, నువ్వు చాలా ఆలోచన లేని వాడివి. ధిక్, నీ జీవితం!! ఒరేయ్, నువ్వు పనిలేని వాడివి. నిన్ను నువ్వు వ్యర్థంగా చంపుకుంటున్నావు. నిలువు, పరిగెత్తు. ఒకవేళ ప్రయత్నిస్తే ఈ గద్ద తన చేతి నుండి నిన్ను వదిలి పెట్టే అవకాశం ఉంది అని నా ఆభిప్రాయం.” అని అంది. ఈ విధంగా హేళనగా దానితో అంటూ ఉండగా ఒక డేగ వచ్చి దాన్ని తన గోళ్ళతో పైకి లేపింది. ఆ క్షణంలో అది గట్టిగా అరిచింది. కానీ ఆ అరుపులను డేగ ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది. అది చూసి కుందేలు తన చావు సమీపిస్తుండగా సమాహితచిత్తుడై ఈ విధంగా అంది- “ఓయి, నిన్ను నువ్వు చాలా హాయిగా ఉన్నాను అని అనుకుంటూ నన్ను ఆక్షేపించావు. అటువంటి నీవు ఇవాళ అదే హాని చేసే హేతువు చేత పట్టుకోబడ్డావు. అయితే నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తాను.” అని.
నీతి- ఎవరైతే ఇతరులకు సలహాలు ఇవ్వడంలో పండితులుగా ఉంటారో, వారికి కష్టం వచ్చినప్పుడు అదే బుద్ది భ్రంశాన్ని పొందుతారు. అటువంటి వాళ్ళు లోకంలో అపహాస్యం పాలు అవుతారు.