అభినవబాలనీతికథాసప్తతిః
38. వృకస్య బకస్య చ కథా
కోఽపి వృకః కఞ్చన మేషం వ్యాపాద్య అభక్షయత్। తస్య అస్థ్నామేకం తస్య గలే తిర్యక్ పతితమ్। తస్మాత్ గలరన్ధ్రః రుద్ధః అభవత్। తతః ఆర్తః సః ఉచ్చైః రటన్ వనే భ్రమతి స్మ। యద్యత్ సత్త్వం మార్గే దృష్టం తత్తత్ అతికరుణయా వాచా సః ఏవం అభణత్– “హే సౌమ్య యది కృపయా గలగతమిదమస్థి నిష్కాసయసి తర్హి అనల్పం పారితోషికం దాస్యామి।” ఇతి। తతః ఏకః బకః పారితోషికలోభేన పురః గత్వా అభయశపథం కారయిత్వా తన్ముఖే స్వాం లమ్బాం గ్రీవాం నివేశ్య తదస్థి నిష్కాసయత్। తతః బకేన పారితోషికే యాచితే వృకః విస్ఫారితచక్షుః తం ప్రాహ– “రే అధమ, త్వత్సదృశః మూర్ఖః అదృష్టపూర్వః। మమ గలగతాం తవ గ్రీవాం అచర్విత్వా మయా త్వం జీవన్నేవ ముక్తః। ఏతావతాప్యసన్తుష్టః పారితోషికం యాచసే। ఇదమాశ్చర్యమేవ।” ఇతి॥
నీతిః– ఉపకారిషు అపి అపకారకరణం దుష్టానాం స్వభావః॥
ప్రశ్నాః-
౧. వృకస్య గలరన్ధ్రః కస్మాత్ రుద్ధ అభవత్?
౨. సః సత్వాన్ కిమభణత్?
౩. బకః కిమకరోత్?
౪. బకేన పారితోషికే యాచితే వృకః కిం ప్రాహ?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతి
కథా సప్తతి
38. తోడేలు కొంగ కథ
ఒక తోడేలు ఒక మేకను
చంపి తినేసింది. దాని ఎముక ఒకటి దీని గొంతులో అడ్డం పడింది.
దానితో గొంతు కుత్తుక మూసుకుపోయింది. దానితో బాధకలిగి అది గట్టిగా అరుచుకొంటూ వనలో
తిరగసాగింది. ఏ ప్రాణిని మార్గంలో చూస్తే, దానితో చాలా దీనమైన పలుకులతో అది ఈవిధంగా
మాట్లాడింది– “ఓ మంచివాడా, దయతో గొంతులో ఇరుక్కొన్న ఎముకను తీసేస్తే చాలా పారితోషికాన్ని ఇస్తాను.” ఇతి। అప్పుడు ఒక కొంగ పారితోషికం ఆశతో ముందుకు వచ్చి, అభయం (హాని చేయనని) మాట
ఇప్పించుకొని, దాని ముఖంలోకి తన పొడుగాటి గొంతును (ముక్కును) దూర్చి
ఆ ఎముక ముక్కను తీసేసింది. అప్పుడు ఆ కొంగ పారితోషికం అడుగగా తోడేలు కళ్ళు విప్పార్చి, దానితో ఇట్లా అన్నది– “ఓ అధముడా, నీలాంటి మూర్ఖుడిని నేను ముందు చూడలేదు. నా గొంతులోకి దూర్చిన
నీ ముక్కును కొరకకుండా నిన్ను ప్రాణాలతో
వదిలేశాను. దీనితోకూడా అసంతుష్టుడివి కాక పారితోషికం అడుగుతున్నావే. ఇది ఆశ్చర్యమే।”॥
నీతి– ఉపకారులకు కూడా అపకారం
చేయటం దుష్టుల స్వభావం.॥
No comments:
Post a Comment