Thursday, 10 November 2016

40. దరిద్రస్య బ్రాహ్మణస్య కథా - 40. దరిద్రుడైన బ్రాహ్మణుడి కథా



అభినవబాలనీతికథాసప్తతిః
40. దరిద్రస్య బ్రాహ్మణస్య కథా
            మగధదేశే కశ్చిత్ దరిద్రః బ్రాహ్మణః ఆసీత్ కస్మింశ్చిత్ పుణ్యే దినే సః తైలభాణ్డస్య దానం గృహీత్వా స్వగ్రామం న్యవర్తత సః మార్గస్య మధ్యే శ్రమస్య పరిహారాయ శీతలే వృక్షస్య మూలే న్యషీదత అథ సః తత్ర శయానః ఏవం ఆలోచయితుమ్ ఆరభత– “అహం ఇదానీం ఏతావత్ తైలం సముపార్జమ్ ఏతత్ విక్రీతం చేత్ త్రీణి రూప్యాణి లభేయ ఏభిః రూప్యైః ఏకాం అజాం క్రేష్యామి తస్యాః శిశవః తేషాం శిశవః జాయేరన్ తతః తేషాం సముదాయం విక్రీయ లబ్ధైః ధనైః మహిషీః గాశ్చ క్రేష్యామి తేషాం ద్వారా బహుధనం సమ్పాద్య రమ్యం హర్మ్యం విరచయిష్యామి తతః కామపి సున్దరీం కన్యాం పరిణేష్యామితతః చన్ద్రికాయాం మణిమయే మఞ్చే తయా సః వివిధాని సుఖాని అనుభవేయమ్ ఏవం మమ జన్మ సఫలం కరిష్యామి సా మే భార్యా మమ ఆజ్ఞాం ఉల్లఙ్ఘయిష్యతి చేత్, తామేవం పాదేన తాడయిష్యామిఇతి ఇత్యాలోచయన్నేవ స్వస్య పాదస్య సమీపే విద్యమానం తైలభాణ్డం పాదేన అతాడయత్ తత్ భాణ్డం భగ్నం ఆసీత్ సర్వం తైలమపి నష్టం అభవత్
            నీతిఃవృథా మనోరథాః ప్రయోజనాయ భవన్తి
ప్రశ్నాః-
.       కః కిం గృహీత్వా స్వగ్రామం న్యవర్తత?
.       సః కుత్ర ఆలోచయితుమ్ ఆరభత?
.       కుతః పాదేన భార్యాం తాడయిష్యతి సః?
.       అన్తే కిమభవత్?
.       అస్యాః కథాయాః నీతిః కా?

అభినవబాలనీతి కథాసప్తతి
40. దరిద్రుడైన బ్రాహ్మణుడి కథా
   మగధ దేశంలో ఒక దరిద్రుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక పుణ్య దినాన అతడు ఒక నూనె భాండం దానంగా తీసుకుని తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు. మార్గ మధ్యలో అలసట తీర్చుకోవటానికి చల్లటి చెట్టు మూలంలో కూర్చున్నాడు. అప్పుడు అక్కడ పడుకుంటూ అతడు ఈవిధంగా ఆలోచించడం మెదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఇంత తైలాన్ని సంపాదించుకున్నాను. ఇది అమ్మితే మూడు రూపాయలు వస్తాయి. నాకు ఈ మూడు రూపాయలతోటి ఒక గొర్రెను కొంటాను. దానికి పిల్లలు పుడతారు. మళ్ళీ వాటికి పిల్లలు పుడతారు. ఇక వాటి తండ అట్లా పెరుగుతుంది. దాన్ని అమ్ముకొని దాంతో వచ్చిన ధనంతో దున్నపోతులను, ఆవులను కొనుక్కొంటాను. వాటి ద్వారా చాలా ధనాన్ని సంపాదించి, అందమైన భవనాన్ని కట్టుకుంటాను. దాని తరవాత ఎవరైనా మంచి అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను. అప్పుడు వెన్నెలలో మణులతో కూడిన మంచం మీద ఆమెతో వివిధ సుఖాలను అనుభవిస్తాను. ఈ విధంగా నా జన్మ సఫలం చేసుకుంటాను. ఆ నా భార్య నా ఆజ్ఞను ఉల్లంఘిస్తే కనుక ఆమెను పాదంతో తంతాను.” అని ఈ విధంగా ఆలోచిస్తూ తన పాదంతో సమీపంలో ఉన్న తైలభాండాన్ని కాలితో తన్నేశాడు. ఆ భాండం విరిగిపోయింది. ఆ తైలం అంతా నష్టం అయిపోయింది.
నీతి- వృథా కోరికలు ఏ ప్రయోజనాన్ని కలిగించవు.
-----------------------------

No comments:

Post a Comment