అభినవబాలనీతికథాసప్తతిః
33. మృషాభాషిణః బాలస్య కథా
ఏకస్మిన్ అగ్రహారే ఏకః బ్రాహ్మణః ఆసీత్। తస్య ఏకః కుమారః అభవత్। కదాచిత్ సః విప్రః తేన కుమారేణ సహ కాశీం గన్తుం ప్రాతిష్ఠత। మార్గస్య మధ్యే సః బాలః ఏకం అక్రన్దత్,– “తాత, వ్యాఘ్ర ఆగచ్ఛతి, వ్యాఘ్ర ఆగచ్ఛతి।” ఇతి। తత్ ఆకర్ణ్య ద్విజః పరావృత్య అపశ్యత్। తత్ర వ్యాఘ్రః నైవాసీత్। తతః సః విప్రః పురస్తాత్ కిఞ్చిత్ దూరం గతవాన్ తదానీం వ్యాఘ్రః సాక్షాదాగతః। అథ సః పుత్రః భయేన వేపమానః సన్– “తాత, వ్యాఘ్రః, వ్యాఘ్రః।” ఇతి పునః పునః ఆక్రోశత్। తత్ శ్రుత్వా జనకః తు– “అయం పురేవ అసత్యం భాషతే।” ఇతి అపరావర్తమానః ఏవ అగచ్ఛత్। తతః వ్యాఘ్రః పృష్ఠతః గచ్ఛన్తం బాలం అపహృత్య అభక్షయత్॥
నీతిః– అసత్యవాదీ కేనాపి న విశ్వస్యతే॥
ప్రశ్నాః-
౧. బ్రాహ్మణః కుత్ర ఆసీత్?
౨. బాలః కిమాక్రన్దత్?
౩. వ్యాఘ్రః కదా సాక్షాదాగతః?
౪. పితా కుతః అపరావర్తమానః ఏవ అగచ్ఛత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతి
కథా సప్తతి
33. అబద్ధాలాడే పిల్లవాడి కథ
ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఒక కుమారుడు కలిగాడు. ఒకసారి ఆ విప్రుడు తన కుమారుడితో కలిసి కాశీకి వెళ్ళటానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆ బాలడు ఒక్కసారి అరిచాడు– “నాన్నా, పులి వస్తోంది, పులి
వస్తోంది..” అది విని ద్విజుడు వెనక్కు తిరిగి చూశాడు. అక్కడ వ్యాఘ్రం లేదు. ఇక విప్రుడు కొంత ముందుకు కాస్త దూరం వెళ్ళాడు. ఆ సమయంలో వ్యాఘ్రం నిజంగానే వచ్చింది. అప్పుడు అతని పుత్రుడు భయంతో వణుకుతూ– “నాన్నా, పులి పులి..” అని
మళ్ళీ మళ్ళీ అరిచాడు. అది విని తండ్రి మాత్రం– “వీడు మొదలు కూడా అసత్యం మాట్లాడతాడు.” అని
వెనకకు తిరిగి చూడకుండానే వెళ్ళాడు. అప్పుడు పులి వెనకనుంచి వెళ్తున్న బాలుని పట్టుకోని తినేసింది.॥
నీతిః– అసత్యం చెప్పేవాడు ఎవ్వరి ద్వారా విశ్వసింపబడడు.॥
No comments:
Post a Comment