Thursday, 8 September 2016

28. ఏకాక్షివికలస్య ఏణస్య కథా - 28. ఒక కన్నులేని జింక కథ



అభినవబాలనీతికథాసప్తతిః
28. ఏకాక్షివికలస్య ఏణస్య కథా
          కశ్చిత్ ఏకాక్షివికలః హరిణః నిత్యమ్ అబ్ధితటే చరన్నాసీత్। స చ ఇత్థమ్ అచిన్తయత్“చరతో మమ కాణమ్ అక్షి జలాభిముఖమ్ అవికలం చాక్షిస్థలమభితః దత్తం చేత్, ఘాతయితా సంనిహితః సన్ జ్ఞాయేత।ఇతి। ఏవమ్ అరిష్టస్య నివారణోపాయం సంవిధాయ ఆత్మానమ్ అకుతోభయం గణయతి స్మ। కశ్చిత్ మృగవధాజీవః చిరాయ తస్మిన్ మృగే బద్ధలక్ష్యోఽపి తం న ప్రాప్తవాన్। తతః స నావమారుహ్య సుగుప్తం జలతః అభ్యేత్య తం హరిణం గులికాప్రక్షేపేణ హతవాన్। ప్రాణోత్క్రమణవేలాయాం స ఏణః ఏవం వ్యలపత్। భో విధే, అనధిగమ్యం తే విలసితం. ఇతో భయమితి యత్రాహమ్ అబోధం తస్మాన్నాహం విద్ధః। అపి తు యత్ర నో భయమితి అబుధ్యే తయైవ దిశా మే నిధనం జాతమ్।ఇతి॥
          నీతిః నిర్భయాః వయమితి న మన్తవ్యమ్। సభయా ఇతి మత్వా నిర్భయత్వసమ్పాదనే నాత్యర్థం యతితవ్యమ్। నిర్భయత్వం నాస్మాస్వధీనమ్॥
ప్రశ్నాః-
౧. కీదృశః హరిణః కుత్ర చరన్నాసీత్?
౨. హరిణః కిమచిన్తయత్?
౩. మృగవధాజీవః తం కథం హతవాన్?
౪. ఏణః ప్రాణోత్క్రమణవేలాయాం కిమచిన్తయత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతి కథా సప్తతి
28. ఒక కన్నులేని జింక కథ
       ఒక కన్నులేని జింక (ఒకే కన్నుతో చూసే జింక) నిత్యము ఒక నదీ తీరంలో తిరుగుతూ ఉండేది. అది ఈ విధంగా  అనుకుంది. ‘తిరుగుతూ ఉన్న నేను గుడ్డిగా ఉన్న కంటిని నీటి వైపు ఉంచి మంచిగా ఉన్న కంటిని భూమి వైపు ఉంచతే కనుక  ఎవరన్నా బోయవాడు నాకు దగ్గర ఉండి ఉంటే నాకు కనిపిస్తాడు’ అని అనుకుంది. ఈవిధంగా అరిష్టాన్ని నివారించే ఉపాయాన్ని తెలుసుకుని దాన్ని అదే భయం లేనిదిగా పరిగణించుకున్నది. ఒకసారి ఒక వేటగాడు ఆ మృగం మీద కన్ను ఉంచిన వాడై దాన్ని పొందలేకపోయాడు. వాడు ఒకసారి పడవ ఎక్కి, మెల్లగా కనిపించకుండా దాగుతూ వచ్చి, నీటి వైపు నుంచి వచ్చి జింకను రాళ్ళతో కొట్టి చంపేశాడు. ప్రాణం పోతున్న వేళ ఆ జింక ఈ విధంగా ఏడిచింది- ‘ఓ! విధి నిన్ను నేను నీ విధి విలాసాన్ని తెలుసుకోలేకపోయాను. నాకు భయం ఉన్నచోటు నుండి నేను కొట్టబడలేదు. ఎక్కడైతే భయంలేదు అనుకున్నానో ఆ దిశ నుంచే నా మరణం సంభవించింది.’ అని.
          నీతి- నిర్భయులమై మనము ఉన్నాము అని మనం ఎప్పుడు అనుకోరాదు. భయంతో ఉన్నామని అనుకుని నిర్భయం పొందుడనికే ప్రయత్నిస్తూ ఉండాలి. నిర్భయం అనేది మన ఆధీనంలో ఉండదు.

Monday, 5 September 2016

27. రాసభశిశోః వన్యసూకరస్య చ కథా - 27. గాడిద, అడవిపంది కథ



అభినవబాలనీతికథాసప్తతి
27. రాసభశిశోః వన్యసూకరస్య చ కథా
          ఏకదా కస్యాంచిత్ అరణ్యాన్యాం రాసభశిశుః వన్యసూకరస్య మిథః సమాగచ్ఛేతామ్। తతః సః గర్దభశిశుః పరిహాసబుద్ధ్యా తం అరణ్యసూకరం అవదత్భావ, ప్రణామః తే। ఇతి। తం అపూర్వం ఉపచారం దృష్ట్వా సః సూకరః వ్యస్మయత। క్రోధవశం గతః సన్అస్య అన్త్రాణి విదార్య బహిః నిష్కాసయేయమ్। ఇతి అమన్యత చ। పరం వివిచ్య సః గర్దభశిశుం అగదత్రే గర్దభాపశద, ఇతః అపసర। యథేప్సితం దేశం అవిలమ్బితం గచ్ఛ। రాసభస్య రక్తేన ఆత్మద్రష్టాం దూషయితుం నోత్సహే। అన్యథా నిమేషార్ధేన త్వాం వ్యాపాదయేత్। ఇతి।
          నీతిః క్షుద్రాః పణ్డితంమన్యా భూత్వా మహతాం పరిహాసం ఆరభన్తే। మహాన్తః తు కోపాయ అవకాశమదత్త్వా తాన్ క్షమన్తే॥
ప్రశ్నాః-
౧.       కౌ కుత్ర సమాగచ్ఛేతామ్?
౨.       పరిహాసబుద్ధ్యా గర్దభశిశుః కిమకరోత్?
౩.       సూకరః కిమమన్యత?
౪.       సూకరః వివిచ్య కిమవదత్?
౫.       అస్యాః కథాయాః నీతిః కా?

అభినవ బాలనీతికథా సప్తతి
27. గాడిద, అడవిపంది కథ
     ఒకసారి ఒక అరణ్యంలో ఒక గాడిదపిల్ల అడవిపందిని కలిసింది. అప్పుడు ఆ గాడిదపిల్ల పరిహాస బుద్ధితో ఆ అడవిపందితో ఈ విధంగా అంది. “బావ!  ప్రణామాలు నీకు అపూర్వ ఉపచారం చూసి  ఆ పంది విస్మయాన్ని చెందింది. ఆ పంది క్రోధంతో ‘వీడి పేగులు బయటకి తీసి పడేస్తాను’ అని మనస్సులో అనుకుంది. కానీ ఆలోచించుకొని గాడిదతో ఈ విధంగా అంది- “ఓ గర్దభాధమా, ఇక్కడనుంచి వెళ్ళు. నీ  ఇష్టం వచ్చిన ప్రదేశానికి ఆలస్యం చెయ్యకుండా వెళ్ళు. నీ రక్తంతో నా పళ్ళను పాడుచేసుకునే ఉద్దేశ్యం నాకు ఏ మాత్రం లేదు. లేకపోతే అర నిమిషములో నిన్ను చంపుతాను.” అని.
     నీతి- నీచులు, తమను తాము పండితులుగా అనుకునే వాళ్ళు- పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళి  పరిహాసం చేస్తారు. గొప్పవాళ్ళు వాళ్ళ కోపానికి, ఆవేశానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళను క్షమించి వదిలి పెడతారు.

Sunday, 4 September 2016

26. భేకానాం బాలకానాం చ కథా - 26. కప్పలు , బాలకుల కథ

అభినవబాలనీతికథాసప్తతిః
26. భేకానాం బాలకానాం చ కథా
          కస్యచిత్ గ్రామస్య సమీపే ఏకః తటాకః ఆసీత్। తస్మిన్ బహవః భేకాః అవసన్। ఏకదా కేచిత్ బాలకాః తస్య తటాకస్య తీరే క్రీడితుం ఆగచ్ఛన్। అథ తస్మిన్ తటాకే మణ్డూకాన్ దృష్ట్వా క్రీడార్థం తేషు లోష్టాన్ ప్రాక్షిపన్। తైః లోష్టైః అనేకే భేకాః అహింస్యన్త। తతః తే శోచితుం ఆరభన్త,– “కిం కుర్మః, క్వ గచ్ఛామః, కః అస్మాన్ ఇదానీం రక్షేత్। ఇతి। తదా కశ్చిత్ వృద్ధః మణ్డూకః తాన్ బాలకాన్ ఆలోక్య ఏవం అకథయత్భోః బాలకాః వయం నిరపరాధాః కిమర్థం ఈదృశాన్ అస్మాన్ ఇత్థం లోష్టైః ప్రహరథ? ఇతి। అథ తే ప్రత్యవదన్హే వృద్ధ వయం యుష్మాన్ న ప్రహరామః; కిం తు లోష్టైః క్రీడామః। ఇతి। తదా సః జరఠః పునః ఏవం ప్రత్యభాషతభోః బాలకాః ఇదం యుష్మాకం క్రీడా ఏవ; పరన్తు అస్మాకం ప్రాణాన్ అపహరతి। ఇతి॥
          నీతిః వినోదార్థం అపి హింసా న కర్తవ్యా॥
ప్రశ్నాః-
౧. భేకాః కుత్ర ఆసన్?
౨. బాలకాః కిమకుర్వన్?
౩. భేకాః బాలకాన్ కిమకథయన్?
౪. బాలకాః కిం ప్రత్యవదన్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------

అభినవ బాలనీతికథా సప్తతి
 26. కప్పలు, బాలకుల కథ
      ఒక గ్రామానికి సమీపంలో తటాకం ఉండేది. దానిలో చాలా కప్పలు ఉంటూ ఉండేవి. ఒకసారి కొంతమంది బాలలు ఆ తటాకం తీరంలో అడుకోవటానికి వచ్చారు. వాళ్ళు ఆ తటాకంలో ఉన్న కప్పలను చూసి, ఆటకోసం వాటి పైన రాళ్ళను విసిరారు. ఆ రాళ్ళ వల్ల చాలా కప్పలకు గాయాలు అయ్యాయి. అప్పుడు అవి ఆలోచించటం మొదలుపెట్టాయి. ఏం చేద్దాము?  ఎటుపోదాము? ఎవరు మమ్మల్ని రక్షిస్తారు?” అని. అప్పుడు ఒక వృద్దుడైన కప్ప ఆ బాలకులను చూసి, ఈ విధంగా అన్నాడు. మేము నిరపరాధులం. ఎందుకు ఈ విధంగా మమ్మల్ని  రాళ్ళతో కొడుతున్నారు?” అని. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పారు- ఓ వృద్ధుడా, మేము మిమల్ని కొట్టట్లేదు. ఈ రాళ్ళతో ఆడుకుంటున్నాం అని. అప్పుడు ఆ వృద్ధుడైన కప్ప ఇట్లా అంది. ఓ పిల్లలారా, మీకు ఇది ఆట కావచ్చు. కానీ ఇది మా ప్రాణాలను అపహరిస్తోంది.అని.
            నీతి- వినోదం కోసం కూడా హింస చేయరాదు.