అభినవబాలనీతికథాసప్తతిః
20. సింహస్య చతుర్ణాం బలీవర్దానాం చ కథా
చత్వారః వృషభాః
ఏకత్ర సమాచరన్తః మైత్రీభావేన వర్తమానాశ్చ కదాపి న విశ్లిష్టాః। ఇత్థం సమేతాన్ తానవలోక్య
కశ్చిత్ సింహః నిత్యం వ్యచిన్తయత్। “ఏకోఽపి ఏతేషాం మమ భోజ్యః భవేచ్చేత్
సమీచీనం స్యాత్।” ఇతి। సః సింహః తాన్ ఏకైకశః వ్యాపాదయితుం
సమర్థః అభవత్। పరం సః సమేతానాం తేషాముపరి ఉత్పతితుమపి న శక్తః। అతః కతిచిత్ దినాని
దూరస్థః ఏవ సః ప్రతీక్షతే స్మ। పరం సః సఙ్కల్పిసిద్ధిం నాభజత। అన్తే సః ఏవం నిరణయత్– “యావదిమే ఏకమతే వర్తన్తే తావదిమే న మే వశం గమిష్యన్తి। తస్మాత్
పిశునః భూత్వా ఏతేషాం భేదం అహం కరిష్యామి।” ఇతి। ఏవం అనుష్ఠితే బలీవర్దాః పరస్పరస్య
ఉపరి ద్వేషబుద్ధిం బుద్ధ్వా వ్యశ్లిష్యన్। తతః సింహః అశ్రమేణ తాన్ అహనత్॥
నీతిః– యావత్ ఐకమత్యం తావత్ శత్రవః కిమపి కర్తుం సమర్థా న భవేయుః॥
ప్రశ్నాః-
౧. కే న విశ్లిష్టాః?
౨. సింహః కిం వ్యచిన్తయత్?
౩. సః కుత్ర న శక్తః?
౪. కథం అశ్రమేణ బలీవర్దాః హతాః?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
--------------------------------
అభినవబాలనీతికథాసప్తతి
20. సింహం, నాలుగు ఎద్దులు
కథ
నాలుగు ఎద్దులు ఒకచోట
ఉంటూ స్నేహంగా, ఎప్పుడూ విడిపోకుండా ఉంటుండేవి. అట్ల వాటిని కలిసిఉండటం చూసి, ఒక సింహం నిత్యం ఇట్లా ఆలోచించేది- “వీటిలో ఒకటైనా నాకు ఆహారమైతే బాగిండేది.” ఆ సింహం వాటిని ఒక్కొక్కటిగా అయితేనే చంపగలదు. కానీ అన్నీ కలిసిఉండగా
వాటిమీద లంఘించటానికి (దుంకటానికి) కూడా శక్తిలేనిది. అందువల్ల కొన్ని రోజులపాటు దూరంగా
ఉంటూ ఎదురుచూసింది (గమనించింది). కానీ దాని సంకల్పం నెరవేరలేదు. చివరకు అది ఇట్లా నిర్ణయించుకుంది-
“ఇవి కలిసి ఉన్నంతవరకు నా వశం కాబోవు. అందువల్ల చాడీలు చెప్పేవాడినై
వాటిని విచ్ఛేదం చేస్తాను.” అని. అట్ల చేయగా, ఎద్దులు పరస్పరం ఒకదానిమీదొకటి ద్వేషాన్ని పెంచుకొని విడిపోయాయి.
ఇక సింహం వాటిని శ్రమ లేకుండా చంపేసింది.
నీతి- ఐకమత్యం
ఉన్నంత సేపు శత్రువులు ఏమీ చేయలేరు.
No comments:
Post a Comment