Sunday, 4 September 2016

2. తస్కరస్య కవేః చ కథా - 2. దొంగ కవి కథ

2. తస్కరస్య కవేః చ కథా
          కశ్చిత్ చోరః పురాకృతస్య పుణ్యస్య వశాత్ కస్యచిత్ నగరస్య రాజా సమజాయత। కదాచిత్ కోఽపి కవిః తస్య అన్తికం ఆగతః। అథః సః కవిః తం రాజానం అధికృత్య కానిచిత్ పద్యాని పఠిత్వా సమ్భావనాం అయాచత। తతః సః రాజా తస్మై కామపి సమ్భావనాం న అయచ్ఛత్। పరన్తు సః స్వస్య భృత్యాన్ ఆహూయ తస్య కవేః సర్వాణి వస్త్రాణి అపనీయ తం విద్రావయితుం ఆదిశత్। తథైవ తే తస్య దేహే వర్తమానాని సర్వాణి అవలుప్య తం విద్రావయన్తి స్మ॥
          నీతిః నీచః మహత్పదం ప్రాప్తోఽపి స్వీయం స్వభావం న త్యజతి॥
ప్రశ్నాః-
౧. కః రాజా సమజాయత?
౨. కః తస్య అన్తికం ఆగతః?
౩. సః కిం కృత్వా కిమయాచత?
౪. తదానీం రాజా కిమాదిశత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
2. దొంగ కవి కథ
          ఒక దొంగ పూర్వం చేసిన పుణ్యం ఫలంవల్ల ఒక నగరానికి రాజు అయినాడు. ఒకసారి ఎవరో కవి అతని నగరానికి వచ్చాడు. ఆ కవి ఆ రాజు మీద కొన్ని పద్యాలు చెప్పి సంభావన అడిగాడు. రాజు అతడికి ఏ సంభావనా ఇవ్వలేదు. కానీ అతడు తన సేవకులను పిలిచి ఆ కవి గుడ్డలన్నీ ఊడదీసి వాణ్ణి వెళ్ళగొట్టండి అని ఆదేశించాడు. అట్లగే వారు అతడి బట్టలు విప్పి తరిమేశారు.
          నీతి- నీచుడు గొప్ప పదవిని పొంది కూడా తన స్వభావాన్ని విడిచి పెట్టడు.

No comments:

Post a Comment