అభినవబాలనీతికథాసప్తతిః
16. ఈశ్వరస్య ఉష్ట్రస్య
చ కథా
ఏకదా కశ్చిత్ క్రమేలకః ఈశ్వరం సప్రశ్రయం
యాచితవాన్ ‘భగవన్, యథా గోమహిషాదయః భవతా శృఙ్గిణః కృతాః తథా కిమహం
న క్రియే। ఆప్తాభ్యాం విషాణాభ్యాం అహం శత్రుభ్యః త్రాణం కుర్యామ్। ఏతాం మే విజ్ఞప్తిం
దేవః శ్రోతుమర్హతి।’ ఇతి। అథ ఈశ్వరేణ ఉక్తమ్।
“రే మూఢ, యన్మయా తుభ్యం దత్తం తత్ అలం విచార్యైవ దత్తమ్।
తేన త్వయా సన్తుష్టేన భావ్యమ్। తత్ అకృత్వా యత్ అన్యస్మై దత్తం తత్ త్వం యాచసే। తర్హి
అన్యధృష్టత్వస్య దణ్డం లభస్వ। తవ కర్ణౌ హ్రస్వౌ భవేతామ్। త్వం చ అతిభారవహకః భవేః।” ఇతి॥
నీతిః– అస్మిన్ జగతి ఈశేన యత్ యత్ దత్తం తత్ తత్ ఉపపన్నమేవ। తత్ అన్యథా
కర్తుం యే యతన్తే తేషాం ఉద్యమాః నిష్ఫలాః భవన్తి। తే చ దుఃఖభాజః భవన్తి॥
ప్రశ్నాః-
౧. క్రమేలకః కం యాచితవాన్?
౨. కే ఈశ్వరేణ శృఙ్గిణః
కృతాః?
౩. కేన సన్తుష్టేన భావ్యమ్?
౪. క్రమేలకః కం దణ్డం
అలభత ?
౫. అస్యాః కథాయాః నీతిః
కా?
--------------------------------
అభినవ బాలనీతికథా సప్తతి
16. భగవంతుడు, ఒంటె కథ
ఒకసారి ఒక ఒంటె ఈశ్వరుణ్ణి దీనంగా అడిగింది-
“భగవంతుడా, గోవులు ఎనుములు మొదలైనవి నీ చేత కొమ్ములు కలవిగా
చేయబడినాయి. ఒకవేళ కొమ్ములను పొందితే నేను
శత్రువుల నుంచి నన్ను నేను రక్షించుకుంటాను. ఈ నా విజ్ఞప్తిని భగవంతుడు వినుగాక.” అని. అప్పుడు ఈశ్వరుడు
ఈ విధంగ అన్నాడు- “ఒరేయ్ మూఢుడా! నాచేత నీకోసం ఇవ్వబడినది బాగా ఆలోచించే ఇవ్వబడింది. దాని చేత
నువ్వు సంతుష్టుడిగా ఉండాలి. అది చెయ్యకుండా నువ్వు ఇతరులకు ఇచ్చింది నీకోసం అని అడుగుతున్నావు.
ఐతే ఈ తప్పుడు పని చేసినందుకు నువ్వు ఈ పని యొక్క దండనను పొందు. నీ చెవులు చిన్నవిగా అయిపోవుగాక. నువ్వు చాలా భారాలు
మోసేవాడివిగా అవ్వుగాక.”
నీతి- ఈ జగత్తులో ఈశ్వరుని చేత ఎవరెవరికి
ఏదేది ఇవ్వబడిందో అది యుక్తంగానే ఉన్నది. అది వేరేగా చెయ్యాలని మార్చిన వాళ్ళ ప్రయత్నాలు
నిష్ఫలాలుగా అయిపోతాయి. వాళ్ళు ఎంతో దుఃఖాన్ని
పొందుతారు.
No comments:
Post a Comment