Sunday, 4 September 2016

17. ఋక్షస్య పాన్థయోశ్చ కథా - 17. ఎలుగుబంటి, ఇద్దరి బాటసారుల కథ

అభినవబాలనీతికథాసప్తతిః
17. ఋక్షస్య పాన్థయోశ్చ కథా
          కౌచిత్ పాన్థౌ దేశాన్తరం ప్రస్థితౌ। తౌ సశపథం సమయమ్ అకురుతామ్। యత్ మార్గే సఙ్కటే ఆపతితే అన్యోన్యస్య విశ్లేషః మా భవతు ఇతి। తతః తయోః ఏకస్మిన్ గహనే వనే గచ్ఛతోః కశ్చిత్ భల్లూకః తౌ ప్రత్యభ్యసరత్। తదా కృశః చపలాఙ్గః తయోః ఏకః ద్రుతగతిత్వాత్ అవిలమ్బితం వృక్షమారూఢః। అన్యః స్థూలత్వాత్ ద్రుతగమనాక్షమః ఆసీత్। తస్మాత్ సః ప్రాణానాయమ్య విగతచేష్టః భూమౌ సుప్తః। తతః సః భల్లూకః తత్రాగత్య కర్ణే ఆఘ్రాయ శవోఽయమితి మత్వా పీడాం అకృత్యైవ న్యవర్తత। ఋక్షే నిర్గతే వృక్షారూఢః పాన్థః శనైః అవతీర్య సస్మితం భాషతే స్మ,– “సౌమ్య, స ఋక్షః కర్ణే కిం త్వాం అకథయత్ ఇతి। అథాన్యః పాన్థః సకోపం ప్రత్యభాషతసః భల్లూకః త్వాదృశేషు శఠేషు విశ్వాసం మా కుర్వితి మాం ఆదిశత్॥
          నీతిః ముధా కోఽపి న భాషేత॥
ప్రశ్నాః-
౧. పాన్థౌ కం సమయమకురుతామ్?
౨. భల్లూకం దృష్ట్వా కృశః కిం కృతవాన్?
౩. స్థూలః కిం కృతవాన్?
౪. ఋక్షే నిర్గతే వృక్షారూఢః కిముక్తవాన్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
--------------------------------
అభినవ బాల నీతి కథా సప్తతి
17. ఎలుగుబంటి, ఇద్దరి బాటసారుల కథ
    ఇద్దరు బాటసారులు దేశాంతరం (ఇతర దేశానికి) బయలుదేరారు. వాళ్ళిద్దరూ ప్రమాణపూర్వకంగా ఒక ఒప్పందం చేసుకున్నారు. అది ఏంటంటే- మార్గంలో ఏదన్నా కష్టం కలిగితే ఒకరినొకరు విడిపోకుండా ఉండాలి అని. అట్లా వాళ్ళిద్దరూ దట్టమైన అడవిలో వెళ్తుండగా ఒక భల్లూకము వాళ్ళిద్దరి వెంటబడింది. అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవడైతే సన్నగా, నిర్బలంగా ఉన్నాడో వాడు గబగబా వేగం కలిగి ఉన్నవాడు అవ్వటం వల్ల, వెంటనే ఒక చెట్టు ఎక్కేశాడు. ఇంకొకడు మాత్రం లావుగా ఉండటం వల్ల గబగబా వెళ్ళలేకపోయాడు. అందువల్ల వాడు ప్రాణాలను ఉగ్గబట్టి, చేష్టలు ఉడిగిన వాడిలాగా భూమి పైన పడుకున్నాడు. అప్పుడు ఆ భల్లూకము అక్కడికి వచ్చి వాడి చెవులను వాసన చూసింది. ఇది శవం అని అనుకుని, వాడికి ఏమీ హానీ చేయకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయాక చెట్టు ఎక్కి కూర్చున్న బాటసారి నెమ్మదిగా కిందకు దిగి నవ్వుకుంటూ ఇట్లా అన్నాడు- మిత్రమా! ఆ ఎలుగుబంటి నీ చెవుల్లో ఏం చెప్పింది?” అని. అప్పుడు ఇంకొక బాటసారి కోపంగా ఈవిధంగా ఉత్తరం (సమాధానం) ఇచ్చాడు- ఆ ఎలుగుబంటి నీలాంటి  మోసగాడి మీద విశ్వాసం పెట్టద్దు.  అని నన్ను ఆదేశించింది ౹౹
          నీతి- అబద్ధాలు ఎప్పుడు చెప్పకూడదు.

No comments:

Post a Comment