5. కాష్ఠవిక్రయిణః
తిన్త్రిణీవృక్షస్య చ కథా
కశ్చిత్ కాష్ఠవిక్రయీ కఞ్చన పరశుం నిర్మితవాన్।
అథ సః తస్మిన్ యోజనీయం దణ్డం సమ్పాదయితుం వనం అగచ్ఛత్। తత్ర కా వా శాఖా అనుకూలా భవేత్
ఇతి వృక్షాన్ పశ్యన్ అతిష్ఠత్। తదా కశ్చన తిన్త్రిణీవృక్షః తమపృచ్ఛత్। “కిం తవ అభీష్టమ్?।” ఇతి। సః అవదత్– “బాహుప్రమాణః దణ్డః ఏవ మమ అభీష్టః।” ఇతి। తతః సః వృక్షః స్వస్య శాఖామ్ ఏకాం తస్మై అయచ్ఛత్। సః అపి తాం
శాఖాం సంతక్ష్య ఆత్మనః పరశౌ సంయోజితవాన్। అథ సః తం తిన్త్రిణీవృక్షం అన్యాన్ వన్యాన్
వృక్షాన్ అపి ఛిత్వా విక్రేతుం ఆరభత॥
నీతిః– శత్రోః కృతః ఉపకారః అపకారాయైవ భవతి॥
ప్రశ్నాః-
౧. కః పరశుం నిర్మితవాన్?
౨. సః వనం కుతః
అగచ్ఛత్?
౩. తిన్త్రిణీవృక్షః
తం కిమయచ్ఛత్?
౪. సః కిం కర్తుమారభత?
౫. అస్యాః కథాయాః
నీతిః కా?
-----------------------------
5. కట్టెలమ్మేవాడు-చింతచెట్టు
కథ
ఒక కట్టెలమ్మేవాడు ఒక గొడ్డలిని (అందులో
ఇనప భాగాన్ని) తయారు చేశాడు. ఇక దానికి జోడించవలసిన కట్టెను సంపాదించటానికి వనానికి
వెళ్ళాడు. అక్కడ ఏ కొమ్మ అనుకూలంగా ఉంటుందా అని చెట్లను చూస్తూ నిలుచున్నాడు.
అప్పుడు ఒక చింతచెట్టు అతడిని అడిగింది- “నీకేమి కోరిక (ఏం
కావాలి)?” అని. అతడన్నాడు- “చేయి అంత
పొడుగు ఉన్న కఱ్ఱ కావాలి.” అప్పుడు ఆ చెట్టు తన
కొమ్మనొకదాన్ని అతడికై ఇచ్చింది. అతడు ఆ కొమ్మను చెక్కి, తన
గొడ్డలికి (అమర్చి) పెట్టుకున్నాడు. ఇంక వాడు ఆ చింతచెట్టును, అడవిలో మిగితా వృక్షాలను కూడా నరికి అమ్ముకోవటం ప్రారంభించాడు.
నీతి- శత్రువుకు చేసిన ఉపకారం కూడా
అపకారమే అవుతుంది.
No comments:
Post a Comment