అభినవబాలనీతికథాసప్తతిః
26. భేకానాం బాలకానాం
చ కథా
కస్యచిత్ గ్రామస్య సమీపే ఏకః తటాకః ఆసీత్।
తస్మిన్ బహవః భేకాః అవసన్। ఏకదా కేచిత్ బాలకాః తస్య తటాకస్య తీరే క్రీడితుం ఆగచ్ఛన్।
అథ తస్మిన్ తటాకే మణ్డూకాన్ దృష్ట్వా క్రీడార్థం తేషు లోష్టాన్ ప్రాక్షిపన్। తైః లోష్టైః
అనేకే భేకాః అహింస్యన్త। తతః తే శోచితుం ఆరభన్త,– “కిం కుర్మః, క్వ గచ్ఛామః, కః అస్మాన్ ఇదానీం రక్షేత్।” ఇతి। తదా కశ్చిత్ వృద్ధః మణ్డూకః తాన్ బాలకాన్
ఆలోక్య ఏవం అకథయత్– “భోః బాలకాః వయం నిరపరాధాః
కిమర్థం ఈదృశాన్ అస్మాన్ ఇత్థం లోష్టైః ప్రహరథ?।” ఇతి। అథ తే ప్రత్యవదన్– “హే వృద్ధ వయం యుష్మాన్ న ప్రహరామః; కిం తు లోష్టైః క్రీడామః।” ఇతి। తదా సః జరఠః పునః ఏవం ప్రత్యభాషత– “భోః బాలకాః ఇదం యుష్మాకం క్రీడా ఏవ; పరన్తు అస్మాకం ప్రాణాన్
అపహరతి।” ఇతి॥
నీతిః– వినోదార్థం అపి హింసా న కర్తవ్యా॥
ప్రశ్నాః-
౧. భేకాః కుత్ర ఆసన్?
౨. బాలకాః కిమకుర్వన్?
౩. భేకాః బాలకాన్ కిమకథయన్?
౪. బాలకాః కిం ప్రత్యవదన్?
౫. అస్యాః కథాయాః నీతిః
కా?
-----------------------------
అభినవ బాలనీతికథా సప్తతి
26. కప్పలు, బాలకుల కథ
ఒక గ్రామానికి సమీపంలో తటాకం ఉండేది. దానిలో
చాలా కప్పలు ఉంటూ ఉండేవి. ఒకసారి కొంతమంది బాలలు ఆ తటాకం తీరంలో అడుకోవటానికి వచ్చారు.
వాళ్ళు ఆ తటాకంలో ఉన్న కప్పలను చూసి, ఆటకోసం వాటి పైన రాళ్ళను
విసిరారు. ఆ రాళ్ళ వల్ల చాలా కప్పలకు గాయాలు అయ్యాయి. అప్పుడు అవి ఆలోచించటం మొదలుపెట్టాయి.
“ఏం చేద్దాము? ఎటుపోదాము? ఎవరు మమ్మల్ని రక్షిస్తారు?” అని. అప్పుడు ఒక వృద్దుడైన
కప్ప ఆ బాలకులను చూసి, ఈ విధంగా అన్నాడు. “మేము నిరపరాధులం. ఎందుకు
ఈ విధంగా మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నారు?” అని. అప్పుడు వాళ్ళు
సమాధానం చెప్పారు- “ఓ వృద్ధుడా, మేము మిమల్ని కొట్టట్లేదు.
ఈ రాళ్ళతో ఆడుకుంటున్నాం అని. అప్పుడు ఆ వృద్ధుడైన కప్ప ఇట్లా అంది. “ఓ పిల్లలారా, మీకు ఇది ఆట కావచ్చు.
కానీ ఇది మా ప్రాణాలను అపహరిస్తోంది.” అని.
నీతి- వినోదం కోసం కూడా
హింస చేయరాదు.
No comments:
Post a Comment