Sunday, 4 September 2016

15. సృగాలస్య ద్రాక్షాఫలానాం చ కథా - 15. నక్క, ద్రాక్షాఫలం యొక్క కథ

 అభినవబాలనీతికథాసప్తతిః
15. సృగాలస్య ద్రాక్షాఫలానాం చ కథా
            క్షుధితః కశ్చిత్ సృగాలః ఆహారార్థం వనే పరిభ్రమన్ ఆసీత్। ఏవం స్థితే, సః ద్రాక్షాణాం ఏకం కుఞ్జం దూరే అపశ్యత్। అథ సః కుఞ్జస్య సమీపమాగతః। తదా లతాసు గుచ్ఛతయా లమ్బమానాని ఫలాని తస్య నయనయోః గోచరాణి అభవన్। తాని చ ఫలాని పక్వాని మధురాణి చ ఆసన్। తతః సః ఫలానాం ప్రాప్తయే ఉత్ప్లుత్య ఉత్ప్లుత్య నితరాం అఖిద్యత। పరం తు కుఞ్జస్య ఔన్నత్యాత్ సః ఏకం అపి ఫలం న అలభత। తదా సః కోపాత్ ఏవం అవదత్- కః వా మూఢః అపక్వాని అమ్లాని చ ఫలాని అభిలషేత్? ఇతి। ఇత్థం వదన్ సః పరావృత్య గతః॥
            నీతిః అలభ్యే వస్తుని దోషస్య ఆరోపణం సహజమ్॥
ప్రశ్నాః-
౧. శృగాలః కుతః కుత్ర చ పరిభ్రమన్ ఆసీత్?
౨. సః కిమపశ్యత్?
౩. సః కుతః అఖిద్యత?
౪. సః కోపాత్ కిమవదత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
అభినవ బాలనీతి కథా సప్తతి
15. నక్క, ద్రాక్షాఫలం యొక్క కథ
          ఆకలిగా ఉన్న ఒక నక్క ఆహారంకోసం వనంలో తిరుగుతూ ఉంది. అప్పుడు అది ఒక ద్రాక్షావనం దూరంగా చూసింది. దాని దగ్గరకి వెళ్ళింది. అక్కడ తీగలకు గుఛ్ఛాలుగా వేళ్ళాడుతున్న ఫలాలు దాని కళ్ళలో కనిపించాయి. ఆ ఫలాలు పండి తీయగా ఉన్నాయి. అప్పుడు అది ఆ ఫలాలను పొందడానికి ఎగిరీ ఎగిరీ అలిసిపోయి బాధపడింది. కానీ ఆ లతా కుంజము ఉన్నతంగా ఉండడం వల్ల ఒక్క ఫలం కూడా పొందలేకపోయింది. అపుడు అది కోపంగా ఈ విధంగా అంది- “ఎవడు ఈ పుల్లనివైన ఫలాలను కోరుకుంటాడు?” అని. ఇట్లా అని అది అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
          నీతి- దొరకని వస్తువులో దోషారోపణం చెయ్యటం చాలా సహజం.

No comments:

Post a Comment