అభినవబాలనీతికథాసప్తతిః
12. అజస్య, శృగాలస్య చ కథా
కశ్చిత్ సృగాలః పానీయం పాతుం కామపి వాపీం
గతః। తత్ర దుర్దైవవశాత్ స జలే న్యమజ్జత్। బహిః నిర్గన్తుం తేన బహవః యత్నాః కృతాః పరం
సః వన్ధ్యప్రయత్నః జాతః। అత్రాన్తరే కోఽపి అజః తత్ర ఆగత్య తమ్ అపృచ్ఛత్। “అపి జలం మధురమ్?।” ఇతి। జమ్బుకః ప్రత్యభాషత– “మధరమితి కిం వదామి? ఏతత్ కేవలం పీయూషమేవ।
ఏతత్ పాయం పాయం మే వాఞ్ఛా న నివర్తతే। ఏతత్ హాతుం నాహమ్ ఉత్సహే।” ఇతి। తత్ నిశమ్య అజః అన్తః ప్రావిశత్। తదైవ
సృగాలః తస్య దీర్ఘశృఙ్గయోః పదం నిధాయ బహిరాగచ్ఛత్। అజస్తు మజ్జనోన్మజ్జనే అసకృదనుభూయ
మృతః॥
నీతిః– ‘ప్రయోజనమనుద్దిశ్య న మన్దోఽపి ప్రవర్తతే’ ఇతి సర్వత్ర దృశ్యతే। పరహితాయ యతమానాః పురుషాః
విరలాః॥
ప్రశ్నాః-
౧. శృగాలః కుత్ర గతః?
౨. సః కుత్ర న్యపతత్?
౩. అజః తం కిమపృచ్ఛత్?
౪. జమ్బుకః కిం ప్రత్యవదత్?
౫. అస్యాః కథాయాః నీతిః
కా?
--------------------------------
అభినవ బాలనీతి కథ సప్తతి
12. గొర్రె, నక్క కథ
ఒక నక్క నీరు తాగటానికి ఒక బావి దగ్గరకు
వెళ్ళింది. అక్కడ భాగ్యం బాగోలేక నీటిలోకి పడిపోయింది. బయటకు రావటానికి చాలా ప్రయత్నాలు
చేసింది. కానీ విఫలమయ్యాయి. అప్పుడే అక్కడికి ఒక గొర్రె వచ్చింది. వచ్చి దాన్ని ఇట్లా
అడిగింది- “ఈ నీరు మధురంగా ఉందా?” అప్పుడు ఆ నక్క జవాబు
చెప్పింది- “అరే, నీరు తీయ్యగా ఉండటం ఏంటి? ఈ నీరు అంతా కూడ అమృతంలా
ఉంది. ఇవి తాగి తాగి నా కోరికే తీరట్లేదు. దీన్ని వదిలి పెట్టాలి అనిపించట్లేదు. (వదిలి
పెట్టడానికి నేను ఇష్టపడట్లేదు)” అంది. అప్పుడే ఆ గొర్రె దాని లోపలికి ప్రవేశించింది.
అప్పుడు ఆ నక్క దాని పొడవాటి కొమ్ముల మీదకు ఎక్కి బయటకి వచ్చేసింది. అక్కడ ఆ గొర్రె
మాత్రం నీటిలో మునిగి మునిగి చనిపోయింది.
నీతి- ‘ప్రయోజనం లేకుండా మంద
బుధ్ధి ఉన్నవాడు కూడా ముందుకు వెళ్ళడు’ అని అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇతరుల హితం కోసం ప్రయత్నం చెసేవాళ్ళు
చాలా తక్కువ మంది ఉంటారు.
No comments:
Post a Comment