Sunday, 4 September 2016

1. మూఢస్య కుక్కురస్య చ కథా - 1. మూఢుడు, కుక్క కథ

1. మూఢస్య కుక్కురస్య చ కథా
          ఏకస్మిన్ గ్రామే మన్దమతిః నామ మూఢః ప్రతివసతి స్మ। తస్య వశే కుక్కురః అవర్తత। సః తం కుక్కురం శ్వేతం కర్తుం ఐచ్ఛత్। తథైవ సః తం కుక్కురం నదీం నీత్వా బహూన్ దివసాన్ జలేన ప్రక్షాలయన్ అతిష్ఠత్। తథాపి సః కృష్ణః భషకః శ్వేతః న అభవత్। తతః జనాః తస్య మౌఢ్యం దృష్ట్వా తం పర్యహసన్। తేన సః నితరాం దుఃఖితః సమభవత్।
          నీతిః అసాధ్యం సాధయితుం న యతేత॥
ప్రశ్నాః-
౧. మూఢస్య నామ కిమాసీత్?
౨. సః కిమిచ్ఛతి స్మ?
౩. ఇచ్ఛాపూర్త్యర్థం సః కిమ్ అకరోత్?
౪. కిమర్థం జనా తమహసన్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------

1. మూఢుడు, కుక్క కథ
          ఒక గ్రామంలో మందమతి అనే మూఢుడు ఉండేవాడు. వాడి దగ్గర ఒక కుక్క ఉండేది. వాడు కుక్కను తెల్లగా చెయ్యాలని చాలా కోరుకున్నాడు. అట్లా అతను రోజూ కుక్కను నదికి తీసుకెళ్లి నీటితో శుభ్రం చేస్తూ ఉండేవాడు. ఐనప్పటికీ  నల్లని కుక్క తెల్లగా అవ్వలేదు. అప్పుడు జనాలు వాడి మూఢత్వాన్ని చూసి నవ్వుకున్నారు. అపుడు అతడు చాలా బాధ పడ్డాడు. నీతి-- అసాధ్యం కానిది సాధించాలని ప్రయత్నించరాదు.

No comments:

Post a Comment