Sunday, 4 September 2016

11. సగదస్య చిల్లస్య కథా - 11.రోగంతో ఉన్న ఎండ్రకాయ కథా

అభినవబాలనీతికథాసప్తతిః
11. సగదస్య చిల్లస్య కథా
     కశ్చిత్ చిల్లః చిరం రుగ్ణః ముమూర్షుః అభవత్। తతః స ఆత్మనః పూర్వకర్మాణి స్మారం స్మారం భయత్రస్తమనాః మాతరమవదత్––భోః మాతః కైశ్చిత్ వ్రతైః నియమైః, ఉపవాసైః, అన్యైశ్చ భక్తిప్రకారైః దేవం అనామయం మదర్థం యాచస్వ। ఇతి। జననీ ప్రత్యవదత్జాత, దేవః ప్రార్థితోఽపి తే ఆరోగ్యం దాస్యతీతి నాహం మన్యే। త్వం జన్మనః ప్రభృతి హింసాపరః। కిఞ్చ దేవతాభ్యః అర్పితానాం బల్యుపహారాణామపహారాత్ విరతో నాభవః। అన్యచ్చ। తవ కదాపి అనుశయః న జాతః। ఏవం వర్తమానే కథం నామాహం దేవం త్వద్గదనివృత్తిమభ్యర్థయే। ఇతి॥
          నీతిః మరణసమయేపాపోఽహం, పాపకర్మాహం, కా మే గతిః స్యాత్। ఇత్యేవంవిధచిన్తాయాః పూర్వమేవ పురుషేణ సమాహితేన భావ్యమ్। ఆత్మనః సుఖం యః అభివాఞ్ఛతి, సః పూర్వమేవ దుష్కర్మాణి దూరతః పరిత్యజేత్॥
ప్రశ్నాః-
౧. కః ముమూర్షుః అభవత్?
౨. సః మాతరం కిమవదత్?
౩. జననీ కిం న మన్యతే స్మ?
౪. సా కుతః దేవం నాభ్యర్థయతే?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
--------------------------------
అభినవ బాలనీతి కథా సప్తతిః
11.రోగంతో ఉన్న ఎండ్రకాయ కథా
          ఒక ఎండ్రకాయ చాలా కాలంగా రోగంతో ఉండి చచ్చిపోయే స్థితిలో ఉంది. అప్పుడు అది తన అంతరాత్మలో పూర్వం చేసిన పనులను తల్చుకుని, తల్చుకుని  చాలా భయాన్ని పొంది తన తల్లితో ఇట్లా అంది- ఓ అమ్మా! ఏదన్నా నియమాలతో, వ్రతాలతో, ఉపవాసాలతో, ఇంకా ఇతర భక్తి మార్గాలతో దేవుడిని నాకోసం ఆరోగ్యం కావాలని  అని ప్రార్థన చేయవా?” అని! అప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లా అంది- నాయనా, దేవుడు ప్రార్థించినప్పటికి కూడా నీకు ఆరోగ్యం ఇస్తాడని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి హింసనే చేశావు. దేవతలకు అర్పించిన బలి, ఉపహారం కూడా నువ్వు ఇప్పటికీ కూడా అపహరించి ఉన్నావు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా దాని గురించి పశ్చాత్తాపం పడలేదు. అందుకని ఇట్లా ఉన్నపుడు నేను ఏంచేసి నీ ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థించాలి?” అని అంటుంది.
          నీతి- మరణ సమయంలో నేను పాపాత్ముడిని, నేను పాపాలు చేశాను, నా గతి ఏంటి అని ఈవిధంగా ఆలోచించేకంటే ముందరే మనిషి మొదలే సమాధానం పొంది ఉండాలి. తన యొక్క సుఖం ఎవరైతే కోరుకుంటారో వాడు మొదలే చెడు కర్మలకు దూరంగా ఉండి, వాటిని వదిలిపెట్టాలి.

No comments:

Post a Comment