Sunday, 4 September 2016

23. దేవస్య శకటవాహస్య చ కథా - 23. భగవంతుడు, బండివాడి కథ

అభినవబాలనీతికథాసప్తతిః
23. దేవస్య శకటవాహస్య చ కథా
కశ్చన నిర్బుద్ధిః శకటవాహకః శకటం నయన్ ఆసీత్। ఏకస్మిన్ స్థలే పఙ్కరుద్ధచక్రం తత్ శకటం ధుర్యాణాం మహతా ప్రయత్నేనాపి మోచయితుం సః శక్తః నాభవత్। యదా అసౌ అక్షమః ఆసీత్ తదా సః దేవం ఏవం ప్రార్థయత,– “భో దేవ, అహం దీనః। నిరాశ్రయః అహమ్। అస్మిన్ కృచ్ఛ్రే మే సహాయః భవ। ఇతి। ఇత్థం సంప్రార్థ్య సః నిరుద్యమః స్థితః। దేవస్తు తస్య ప్రార్థనాం శ్రుత్వా తం చ తూష్ణీం ఆసీనం దృష్ట్వా తం అవదత్,– “భో మూఢ కిమితి భవాన్ అలసః జోషం ఆస్తే। మమ సాహాయ్యం వాఞ్ఛితం చేత్, తర్హి ఉత్తిష్ఠ। ధుర్యాన్ చోదయ। రథాఙ్గే స్కన్ధేన ఉపస్తమ్భయ। ఏవం కృతే అహం తే సాహాయ్యం కుర్యామ్। ఇతి। తతః శకటవాహేన తథా కృతమ్। శకటం చ పఙ్కాద్బహిరాగతమ్।
            నీతిః నిరుద్యమః దైవసాహాయ్యం కదాపి న లభతే।
ప్రశ్నాః-
౧. కః శకటం నయన్ ఆసీత్?
౨. కిం కర్తు స న శక్తః?
౩. దేవం సః కిం ప్రార్థయత్?
౪. శకటం పఙ్కాద్బహిః కథం ఆగతమ్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
 
అభినవబాల నీతి కథా సప్తతిః
23. భగవంతుడు, బండివాడి కథ
           ఒక బుద్ధి హీనుడైన బండివాడు బండి తీసుకుని వెళ్తున్నాడు. ఒక చోట బురద వల్ల  చక్రం ఇరుక్కుపోయి ఆ బండిచక్రం యొక్క భారాన్ని ఎద్దులు ఎంత ప్రయత్నించినా కూడా కదిలించలేకపోయాయి. అప్పుడు వాడు చేతకాక భగవంతుడిని ఈ విధంగా ప్రార్ధించాడు- ఓ భగవంతుడా, నేను దీనుడిని. నా దగ్గర ఏమి ఆశ్రయం లేదు. ఈ భయంకరమైన సమయం లో నాకు సహాయం చెయ్యి.అని అట్లా ప్రార్థించి వాడు ఏ ప్రయత్నం చేయకుండా నిలబడ్డాడు. భగవంతుడు వాడి ప్రార్థనను విని వాడితో ఈ విధంగా అన్నాడు- ఒరే మూఢుడా, ఏంటి నువ్వు ఇంత బద్దకంగా కూర్చుని ఉన్నావు? నా సహాయం కావాలి అంటే  లే. ముందు ఎద్దులను కదిలించు. చక్రాన్ని నీ భుజంతో ఎత్తడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు అట్లా చేస్తే నేను నీకు సహాయం చేస్తాను.అన్నాడు. అప్పుడు బండివాడు అట్లాగే చేశాడు. అప్పుడు  ఆ బండి బయటకి వచ్చింది.
          నీతి- (తన వంతు) ప్రయత్నం చేయని వాడికి దైవసహాయం అందదు.

No comments:

Post a Comment