Sunday, 4 September 2016

18. సారమేయేన దష్టస్య పురుషస్య కథా - 18. ఒక కుక్కచే కరవబడ్డ మనిషికథ

అభినవబాలనీతికథాసప్తతిః
18. సారమేయేన దష్టస్య పురుషస్య కథా
          కోఽపి సారమేయః కంచన పురుషం అదశత్। తథా కాచిత్ మహత్తరీ తస్మై నరాయ విషశమనార్థం ఏకముపాయమేవమకథయత్। “తాత, అపూపఖణ్డం గృహీత్వా తం క్షతప్రదేశే నిధాయ కృతక్షతం భషకం తం ఖణ్డం ఆశయ। ఏవం కృతం చేత్ విషబాధా నశ్యేత్। ఇతి। తథైవ కృతే విషబాధా నష్టా। యథోక్తం అనుష్ఠితవన్తం తం తేన మార్గేణ గచ్ఛన్ కశ్చిత్ బుధః దృష్ట్వా అపృచ్ఛత్ “రే, కిమిదమారబ్ధం త్వయా? ఇతి। క్షతః యథావత్ అవదత్। తత్ శ్రుత్వా సః విద్వాన్ తం ఏవం ఉపాదిశత్। “రే, యద్యేవం తర్హి ‘రహః ఏతత్ కురు’। ఇతి త్వామహం ప్రార్థయే। ఇమాం ప్రవృత్తిం పత్తనవాసినః శునకాః యది శ్రోష్యన్తి తర్హి అస్యాం పుర్యాం కమపి అక్షతం తే న అవశేషయన్తి। ఇతి॥
          నీతిః ఏనస్వినః దణ్డమేవార్హన్తి। పరం తు భీతాః తాన్ మధురవచనైః సాన్త్వయన్తి చేత్, తర్హి తైః తద్భాజనం రహస్యేన కర్తవ్యమ్। నో చేత్ సాధూనాం మానహానిః దురాత్మనాం ఉత్కర్షశ్చ భవేత్॥
ప్రశ్నాః-
౧. కః పురుషమ్ అదశత్?
౨. మహత్తరీ కిమకథయత్?
౩. బుధః తం కిమపృచ్ఛత్?
౪. విద్వాన్ తం కిముపాదిశత్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?

--------------------------------

అభినవబాలనీతి కథా సప్తతిః
18. ఒక కుక్కచే కరవబడ్డ మనిషికథ
      ఒక కుక్క ఒక మనిషిని కరిచింది. అప్పుడు ఒక పెద్దామె అతడికి దాని విషం పోయే ఉపాయం చెప్పింది. నాయనా, ఒక గారె ముక్క తీసుకుని కుక్క కరిచిన స్థానంలో అది పెట్టి  ఏ కుక్కైతే నిన్ను కరిచిందో, దాని దగ్గరకు తీసుకెళ్ళి ఆశ పెట్టు. అట్లా చేస్తే ఆ విషబాధ తగ్గిపోతుంది. అతడు నిజంగానే అట్లా చేసినప్పుడు ఆ విషబాధ పోయింది. అతడు ఆ చెప్పిన విధంగా చేస్తున్నప్పుడు ఆ మార్గంలో వెళ్తూ ఉన్న ఒక పెద్దాయన ఈ విధంగా అడిగాడు- ఒరే! ఇదేంట్రా నువ్వు మొదలుపెట్టావు?” అని. అప్పుడు కుక్క కరిచిన వ్యక్తి మొత్తం అంతా విషయం చెప్పాడు. అది విని ఆ విద్వాంసుడు ఇట్లా ఉపదేశించాడు- “నాయనా, ఒకవేళ నువ్వు ఈ విధంగా చేస్తే రహస్యంగా చెయ్యమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీ ఈ ప్రవృత్తిని ఈ పట్టణంలో ఉన్న కుక్కలు చూసినవి అనుకో, అప్పుడు ఈ నగరంలో ఒక్కడు కూడా కుక్క కరవకుండా మిగలడు.” అని చెప్పాడు.
      నీతి- ఇట్లా ఆచరిస్తే కనుక దానికి దండనే దొరుకుతుంది. ఎవరైతే భయపడి ఉంటారో వాళ్ళను మధురవచలనాలతో శాంతింప చెయ్యాలి. అట్ల చేసినప్పుడు దాన్ని రహస్యంగా చెయ్యాలి. లేకపోతే సాధువులకు ఎప్పుడు కూడా గౌరవ హాని కలుగుతుంది. దుష్టులకు ఎప్పుడు కూడా గొప్పతనం లభిస్తుంది.

No comments:

Post a Comment