Sunday, 4 September 2016

14. భల్లూకస్య నరస్య చ కథా - 14. ఎలుగుబంటి, మనిషి కథ

అభినవబాలనీతికథాసప్తతిః
14. భల్లూకస్య నరస్య చ కథా
          కదాచిత్ కశ్చిత్ భల్లూకః కేనాపి నరేణ సఖ్యం సమ్పాదయతి స్మ। అథ తౌ ఉభౌ వనే సమచరతామ్। ఏవం చరన్తౌ తౌ మధ్యాహ్నే ఆతపేన శ్రాన్తౌ కస్యచిత్ వృక్షస్య అధః సముపావిశతామ్। అథ నరః శ్రమేణ నిద్రాయాః వశం గతః। తదానీం కాచన మక్షికా తస్య ముఖస్య ఉపరి స్థిత్వా నిద్రాయాః భఙ్గం కృతవతీ। తత్ దృష్ట్వా సః భల్లూకః మక్షికాం హత్వా స్వస్య మిత్రం ఉపకర్తుం ఐచ్ఛత్। అథ సః ఆత్మనః మహత్ కరతలం ఉత్థాప్య తేన మిత్రస్య ముఖే ప్రాహరత్। తేన ప్రహారేణ మక్షికా నూనం హతా। పరన్తు మిత్రస్య ముఖం అపి విదారితమ్। ఏవం ఉపకారః అపి అపకారః ఇవ ఆసీత్॥
          నీతిః ఉపకారః యథోచితం కర్తవ్యః॥
ప్రశ్నాః-
౧. భల్లూకః కిం సమ్పాదయతి స్మ?
౨. తౌ కుత్ర ఉపావిశతామ్?
౩. మక్షికా కిం కృతవతీ?
౪. మిత్రస్య ముఖం కుతః విదారితమ్?
౫. అస్యాః కథాయాః నీతిః కా?

--------------------------------
అభినవ బాల నీతికథా సప్తతి
14. ఎలుగుబంటి, మనిషి కథ
          ఒకప్పుడు ఒక ఎలుగుబంటి ఒక మనిషితో స్నేహం చేసింది. వాళ్ళిద్దరూ వనంలో తిరుగుతుండేవారు.  ఒకసారి ఆవిధంగా తిరుగుతుండగా మధ్యాహ్న సమయంలో ఎండ వల్ల అలసిపోయి, ఒక వృక్షం కింద ఇద్దరూ కూర్చున్నారు. అపుడు ఆ మనిషి శ్రమవల్ల నిద్రలోకి జారుకున్నాడు. అపుడు ఒక ఈగ వాడి ముఖంమీద కూర్చుని నిద్రా భంగం చేస్తూ ఉంది. అది చూసి ఎలుగుబంటి ఆ ఈగను చంపి తన మిత్రుడికి ఉపకారం చెయ్యాలి అని అనుకొంది. దానితో అది తన బరువైన చేతితో మిత్రుడి ముఖం మీద ఒక్కటి కొట్టింది. ఆ దెబ్బకి ఈగ చచ్చిపోయింది. కానీ మిత్రుడి ముఖమంతా కూడా వికారంగా అయిపోయింది. (గాయపడింది). ఈ విధంగా ఉపకారం చేసినా కూడా అది అపకారమే అయిపోయింది.
          నీతి- ఉపకారమనేది యథోచితంగానే చెయ్యాలి. ఏవిధంగా ఉపకారం చెయ్యాలో ఆ విధంగానే చెయ్యాలి.

No comments:

Post a Comment