Monday, 5 September 2016

27. రాసభశిశోః వన్యసూకరస్య చ కథా - 27. గాడిద, అడవిపంది కథ



అభినవబాలనీతికథాసప్తతి
27. రాసభశిశోః వన్యసూకరస్య చ కథా
          ఏకదా కస్యాంచిత్ అరణ్యాన్యాం రాసభశిశుః వన్యసూకరస్య మిథః సమాగచ్ఛేతామ్। తతః సః గర్దభశిశుః పరిహాసబుద్ధ్యా తం అరణ్యసూకరం అవదత్భావ, ప్రణామః తే। ఇతి। తం అపూర్వం ఉపచారం దృష్ట్వా సః సూకరః వ్యస్మయత। క్రోధవశం గతః సన్అస్య అన్త్రాణి విదార్య బహిః నిష్కాసయేయమ్। ఇతి అమన్యత చ। పరం వివిచ్య సః గర్దభశిశుం అగదత్రే గర్దభాపశద, ఇతః అపసర। యథేప్సితం దేశం అవిలమ్బితం గచ్ఛ। రాసభస్య రక్తేన ఆత్మద్రష్టాం దూషయితుం నోత్సహే। అన్యథా నిమేషార్ధేన త్వాం వ్యాపాదయేత్। ఇతి।
          నీతిః క్షుద్రాః పణ్డితంమన్యా భూత్వా మహతాం పరిహాసం ఆరభన్తే। మహాన్తః తు కోపాయ అవకాశమదత్త్వా తాన్ క్షమన్తే॥
ప్రశ్నాః-
౧.       కౌ కుత్ర సమాగచ్ఛేతామ్?
౨.       పరిహాసబుద్ధ్యా గర్దభశిశుః కిమకరోత్?
౩.       సూకరః కిమమన్యత?
౪.       సూకరః వివిచ్య కిమవదత్?
౫.       అస్యాః కథాయాః నీతిః కా?

అభినవ బాలనీతికథా సప్తతి
27. గాడిద, అడవిపంది కథ
     ఒకసారి ఒక అరణ్యంలో ఒక గాడిదపిల్ల అడవిపందిని కలిసింది. అప్పుడు ఆ గాడిదపిల్ల పరిహాస బుద్ధితో ఆ అడవిపందితో ఈ విధంగా అంది. “బావ!  ప్రణామాలు నీకు అపూర్వ ఉపచారం చూసి  ఆ పంది విస్మయాన్ని చెందింది. ఆ పంది క్రోధంతో ‘వీడి పేగులు బయటకి తీసి పడేస్తాను’ అని మనస్సులో అనుకుంది. కానీ ఆలోచించుకొని గాడిదతో ఈ విధంగా అంది- “ఓ గర్దభాధమా, ఇక్కడనుంచి వెళ్ళు. నీ  ఇష్టం వచ్చిన ప్రదేశానికి ఆలస్యం చెయ్యకుండా వెళ్ళు. నీ రక్తంతో నా పళ్ళను పాడుచేసుకునే ఉద్దేశ్యం నాకు ఏ మాత్రం లేదు. లేకపోతే అర నిమిషములో నిన్ను చంపుతాను.” అని.
     నీతి- నీచులు, తమను తాము పండితులుగా అనుకునే వాళ్ళు- పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళి  పరిహాసం చేస్తారు. గొప్పవాళ్ళు వాళ్ళ కోపానికి, ఆవేశానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళను క్షమించి వదిలి పెడతారు.

No comments:

Post a Comment