Sunday, 4 September 2016

22. రాజ్ఞః తస్య పుత్రస్య చ కథా - 22. రాజు, తన పుత్రుని కథ


అభినవబాలనీతికథాసప్తతిః

22. రాజ్ఞః తస్య పుత్రస్య చ కథా

     ఉజ్జయిన్యాం సుదర్శనో నామ రాజా సమభవత్। తస్య ఏకః దుష్టః కుమారః అవర్తత। సః తావత్ దృష్టాన్ శపన్ పణ్డితాన్ పరిహసన్ దరిద్రాన్ బాధమానశ్చ ఆసీత్। ఏవం జనానాం కణ్టకం స్వస్య కుమారం దృష్ట్వా రాజా నితరాం దుఃఖితః అభవత్। ఏవం స్థితే, కదాచిత్ సః రాజా తం కుమారం ఉపహ్వరే ఏవం ఉపాదిశత్అయే వత్స, త్వం ఏవం పణ్డితాన్ అన్యానపి శపసి। ఏతాదృశేన తవ దౌష్ట్యేన మమాపి అపమానః సమ్భవతి। త్వయా కృతేన దూషణేన హీయతే। పశ్య। భాస్కరః అమ్బరస్య మధ్యే వర్తతే। యది ఏకః మౌఢ్యాత్ తస్య ఉపరి గణ్డూషేణ థుత్కరేణ తదా సూర్యస్య స కాపి హానిః అపి తర్హి గణ్డూషకస్య ముఖం శీకరైః దూషితం భవేత్। ఇతి। ఏవం పిత్రాకృతం ఉపదేశం సమాలోచ్య సః కుమారః నిజం దౌష్ట్యం అత్యజత్। తతః పరం సః సుఖం అవర్తత॥

        నీతిః మూర్ఖాః సామ్నైవ సమీకరణీయాః॥

ప్రశ్నాః-

౧. రాజా కుత్ర సమభవత్?

౨. తస్య పుత్రః కీదృశః?

౩. రాజా కుతః దుఃఖితః అభవత్?

౪. కుమారః నిజం దౌష్ట్యం అత్యజత్। కథమ్?

౫. అస్యాః కథాయాః నీతిః కా?



--------------------------------

అభినవ బాలనీతికథా సప్తతి

22. రాజు, తన పుత్రుని కథ

      ఉజ్జయినిలో సుదర్శునుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక దుష్టుడైన కుమారుడు ఉండేవాడు. వాడు కనిపించిన వాళ్ళను తిడుతూ, పండితులను పరిహసిస్తూ, పేదవారిని బాధపెడుతూ ఉండేవాడు. జనాలకు కంటకంగా ఉంటున్న తన కుమారుడిని చూసి రాజు బాగా దుఃఖితుడై ఉండేవాడు. ఇట్లా ఉండగా ఒకసారి రాజు తన కుమారుడిని  దగ్గర కూర్చోపెట్టుకుని ఈ విధంగా ఉపదేశించాడు- బాబూ! నువ్వు ఈ విధంగా పండితులను, ఇతరులను తిడుతున్నావు. ఇటువంటి నీ దుష్టత్వంవల్ల నాకు కూడా అవమానం జరుగుతోంది. నీ చేత చేయబడిన ఈ దూషణము చాలా చెడ్డది. చూడు, సూర్యుడు ఆకాశం మధ్యలో ఉంటాడు. ఎవడైనా బుద్ధిహీనతతో అయన మీద ఉమ్మేసాడనుకో దానివల్ల ఏమైనా ఆయనకి హాని జరుగుతుందా? మన మీదనే అది తిరిగి పడుతుంది.అని చెప్పాడు. ఈ విధంగా తండ్రిచేత చెప్పబడిన ఉపదేశం ఆలోచించుకుని ఆ కుమారుడు తన దుష్ట స్వభావాన్ని వదిలిపెట్టాడు. ఆ తర్వాత అతడు సుఖంగా ఉన్నాడు.

       నీతి- మూర్ఖులు సామోపాయం చేతనే మంచిచేసుకోవలసిన వాళ్ళు.


No comments:

Post a Comment