అభినవబాలనీతికథాసప్తతిః
8. అజస్య సింహస్య
చ కథా
ఏకః కేసరీ పర్వతస్య నితమ్బదేశే చరన్తం కఞ్చన
శుభ్రం అజం అపశ్యత్। తత్ర మే గతిర్నాస్తి ఇతి జ్ఞాత్వా హరిః తమ్ అలపత్– “రే, త్వమీదృశే స్థానే సర్వాహ్ణం చరిత్వా
కిం సుఖం లభసే? ఉత్ప్లుత్య ఉత్ప్లుత్య కదాచిత్ త్వం యది పతేః,
తదా ప్రాణాన్ త్యజేః। తర్హి తే నీచైః ఆగమనం వరమ్। శాద్వలగతాన్ ఇమాన్
కోమలాన్ శాదాన్ మధురాణి తేమాని గుల్మపర్ణాని ఖాద।” ఇతి। అథ ఛాగః ప్రత్యభణత్– “తవ ఉక్తిః సర్వథా అనవద్యా। పరం త్వం మే బుభుక్షిత ఇవ దృశ్యసే।
అతః త్వయా అధిష్ఠితం స్థలమాగత్య మజ్జీవితం సంశయితం నాహం కుర్యామ్।” ఇతి॥
నీతిః– యే స్వార్థపరాః జిహ్మాశ్చ తైః కథితం హితం న విశ్వసితవ్యమ్॥
ప్రశ్నాః-
౧. కః కుత్ర శుభ్రం
అజం అపశ్యత్?
౨. అజః కథం ప్రాణం
త్యజేత్?
౩. గుల్మపర్ణాని
కీదృశాని?
౪. అజస్య జీవితం
కుతః సంశయితం భవేత్?
౫. అస్యాః కథాయాః
నీతిః కా?
-----------------------------
అభినవబాలనీతికథాసప్తతి
8. సింహం, గొఱ్ఱె కథ
ఒక సింహం పర్వతం (మిట్ట) చరియల చివర
తిరుగుతున్న ఒక తెల్లని గొఱ్ఱెను చూసింది. అక్కడికి నేను వెళ్ళలేను అని తెలిసి, సింహం దానితో అన్నది- “ఒరే, నువ్వు
ఇట్లాంటి స్థానంలో తిరుగుతూ ఏం సుఖాన్ని పొందుతావు? (పర్వతాల
మీదకు ఎక్కటానికి) ఎగిరి ఎగిరి ఎప్పుడైనా నువ్వు కిందపడితే, అప్పుడు
ప్రాణాలు పోతాయి. దానికన్నా కిందకు రావటం మంచిది. మెత్తటి, కోమలమైన
పచ్చగడ్డిని, మధురమైన ఈ చిన్ని తడి పొదలను తిను.” ఇక గొఱ్ఱె ఇట్ల ఉత్తరమిచ్చింది- “నీ మాట పూర్తిగా
నిజం. నువ్వు నన్ను తినే కోరికతో ఉన్నట్టున్నావు. అందుకే నువ్వు ఉన్నచోటికి వచ్చి,
నా జీవితాన్ని సందేహంలో పడేసుకోలేను.”
నీతి- ఎవరైతే స్వార్థపరులో, మోసగాళ్ళో వారు చెప్పినది వినరాదు,
No comments:
Post a Comment