అభినవబాలనీతికథాసప్తతిః
25. రజకస్య తస్య గర్దభస్య
చ కథా
ఉజ్జయిన్యాం విలాసః నామ రజకః ఆసీత్। తస్య
వశే ఏకః గర్దభః అవర్తత। సః గర్దభః సదా భారం వహన్ దుర్బలః జాతః। క్రమేణ ఉత్థాతుం అపి
అశక్తః అభవత్। తదా సః రజకః తం వ్యాఘ్రస్య చర్మణా ప్రావార్య సస్యక్షేత్రే అచారయత్। తత్రత్యాః
సర్వే అపి తం వ్యాఘ్రం మత్వా భయాత్ పలాయితాః। కస్మాచ్చిత్ కాలాత్ పరం తస్య క్షేత్రస్య
పాలకః తత్ క్షేత్రం ఆగతః। అథ సః తం ప్రాణినం వీక్ష్య తస్య చేష్టాభిః తం గర్దభం శఙ్కతే
స్మ। అనన్తరం సః గృహం గత్వా ఆత్మానం గర్దభస్య కృత్యా ప్రావార్య తత్ క్షేత్రం పునః ఆగతః।
గర్దభస్తు తం గర్దభీం మత్వా రువన్ సన్ తస్య అన్తికం అభ్యధావత్। తతః సః క్షేత్రస్య పాలకః
తం శబ్దేన గర్దభం బుద్ధ్వా దణ్డేన తం వ్యాపాదయతి స్మ॥
నీతిః– స్వభావో దురతిక్రమః॥
ప్రశ్నాః-
౧. గర్దభః కస్య వశే ఆసీత్?
౨. సః కుతః అశక్తః జాతః?
౩. కుతః సర్వే పలాయితాః?
౪. క్షేత్రపాలకః కతం
గర్దభస్య రహస్యం జ్ఞాతవాన్?
౫. అస్యాః కథాయాః నీతిః
కా?
-----------------------------
అభినవ బాలనీతికథా
సప్తతి
25. చాకలి, గాడిద కథ.
ఉజ్జయినిలో విలాసుడు అనే చాకలి ఉండేవాడు. వాడి
దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద ఎప్పుడు భారాలు మోస్తూ బలహీనంగా అయిపోయింది. నెమ్మదిగా
అది లేవడానికి కూడా శక్తి లేకుండా అయిపోయింది. అప్పుడు ఆ చాకలి వాడు దాన్ని పులి యొక్క
చర్మంతో కప్పేసి పొలాల్లో వదిలిపెట్టేవాడు. అక్కడ అందరు కూడా అది పులి ఏమో అనుకుని
భయం తో పారిపోయేవాళ్ళు. తర్వాత ఆ పొలం యొక్క రైతు ఆ స్థలానికి వచ్చాడు. వాడు ఆ ప్రాణిని
చూసి ఆ చేష్టల తోటి, దాని కదలికలు చూసి గాడిద అని అనుమనపడ్డాడు.
అప్పుడు తన ఇంటికి వెళ్ళి, తను గాడిదాలా వేషం వేసుకుని మళ్ళీ పొలానికి
వచ్చాడు. అప్పుడు ఆ గాడిద వాడిని ఆడగాడిద అనుకుని గట్టిగా ఓండ్రపెట్టింది. ఓండ్రపెడుతూ
దాని దగ్గరకు వచ్చింది. అపుడు ఆ రైతు ఆ అరుపుతో గాడిద అని గుర్తుపట్టి దాన్ని బాగా
కర్రతో కొట్టాడు.
నీతి- స్వభావమనేది ఎవరూ
కుడా అతిక్రమించలేనిది.
No comments:
Post a Comment