Thursday, 20 October 2016

29. నిపుణమతేః గర్దభస్య కథా 29. తెలివిగల గాడిద కథ


అభినవబాలనీతికథాసప్తతిః
29. నిపుణమతేః గర్దభస్య కథా
          కస్మింశ్చిత్ స్థవిరే స్వరాసభం చారయతి సతి, తస్య పరిపన్థీ తమభియాతః। అతః సః గర్దభః త్వరయతి స్మ। తస్మిన్ కాలే సః చక్రీవాన్ తం వృద్ధం పృచ్ఛతి స్మ– “స్వామిన్, సః తే అరాతిః మమ పృష్ఠే భారం నిక్షిపేత్ న వా?” ఇతి। తదా తేన ప్రవయసా ప్రత్యుక్తమ్– “సః భారం త్వయా వాహయిష్యత్యేవ। నాత్ర విసంవాదః।ఇతి। తతః ఖరః పునః తం జరఠం పృచ్ఛతి స్మ– “ప్రభో, త్వం మయా భారవాహనం కరిష్యసి న వా?” ఇతి। వృద్ధేన పునః ఉక్తం– “అహం కరిష్యామ్యేవ। భారోద్వహనం తవ కర్మ ఖలు।ఇతి। బాలేయః పునః గదతి స్మ– “యద్యేవం తర్హి అహం అఙ్గులమాత్రమపి న ప్రచలేయమ్। యది అహం భారోద్వహనక్రియాయాః న ముచ్యే తర్హి కోఽపి మే స్వామీ భవతు। కిం మే హర్షప్రదం కిం వా శోకస్థానమ్?ఇతి॥ 
   నీతిఃఅప్రాప్యలాభాః రఙ్కాః ప్రాయేణ రాజపరివర్తనాభ్యుపాయేషు– “రామో వా రాజా భవతు రాక్షసో వా।ఇతి మన్దాదరాః భవన్తి॥
ప్రశ్నాః-
౧. కః కమభియాతః?
౨. సః చక్రీవాన్ తం వృద్ధం కిం పృచ్ఛతి స్మ?
౩. తేన ప్రవయసా కిం ప్రత్యుక్తమ్?
౪. బాలేయః పునః కిం గదతి స్మ?
౫. అస్యాః కథాయాః నీతిః కా?
-----------------------------
 
అభినవ బాల నీతికథా సప్తతి
29. తెలివిగల గాడిద కథ
          ఒక వయసు మళ్ళిన పెద్దాయన తన గాడిదను మేపుతుండగా అతడి శత్రువు ఎదురు పడ్డాడు. అందువల్ల అతడు గాడిదను తొందర పెట్టాడు. అప్పుడు ఆ గాడిద ఆ వృద్ధుని అడిగింది– “అయ్యా, నీ ఆ శత్రువు కూడా నా వీపు మీద భారాన్ని పెడతాడా (మోయిస్తాడా) లేదా?” అని. అప్పుడు ఆ పెద్దాయన ఇట్లా సమాధానం చెప్పాడు– “అతడు నీ చేత భారం తప్పక మోయిస్తాడు. ఇందులో ఏ సంశయం లేదు.అని. ఇక ఆ గాడిద తిరిగి ఆ ముసలాయనను మళ్ళీ అడిగింది– “అయ్యా, నీవు నా చేత బరువులు మోయిఁస్తావా లేదా?” అని. వృద్ధుడు మళ్ళీ చెప్పాడు– “నేనూ నీ చేత తప్పక మోయిఁస్తాను. బరువులు మోయటం నీ పని కదాఅని. గాడిద తిరిగి ఇట్లా అన్నది– “అట్లాగయితే నేను అంగులం కూడా కదలను. నేను బరువులు మోయటం అనే పనిని వదలలలేని పక్షంలో ఎవరైనా నా యజమాని కానీ గాక. నాకేమిటి సంతోషం, ఏమిటి బాధాకరం?అని
          నీతిఃలాభం దొరకనప్పుడు దుర్మార్గులు చాలామటుకు రాజులు మారిన సమయంలో రాముడు రాజైతే ఏంటి, రాక్షసుడు అయితే ఏంటిఅని ఆదరణ లేకుండా ఉంటారు.

No comments:

Post a Comment